ETV Bharat / city

TDP PROTEST: వినాయక చవితి ఉత్సవాలు జరిపి తీరుతాం: తెదేపా - tdp protest against imposes restrictions on Vinayaka Chavithi

కొవిడ్ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాలు జరిపి తీరుతామని తెదేపా నేతలు(tdp leaders) స్పష్టం చేశారు. మద్యం దుకాణాలు, వైకాపా సభలు, ఊరేగింపులకు అడ్డురాని కొవిడ్ నిబంధనలు.. వినాయక చవితికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు.

tdp protest against imposes restrictions on Vinayaka Chavithi
వినాయక చవితి ఉత్సవాలు జరిపి తీరుతామన్న తెదేపా నేతలు
author img

By

Published : Sep 7, 2021, 8:52 PM IST

కొవిడ్ నిబంధనలు అనుసరించి వినాయక చవితి ఉత్సవాలు జరిపి తీరుతామని మాజీ మంత్రి దేవినేని ఉమ(devineni uma) స్పష్టం చేశారు. అనాదిగా వస్తున్న ఆచారానికి ముఖ్యమంత్రి జగన్​.. అడ్డుకట్ట వేయటం దుర్మార్గమని మండిపడ్డారు. వినాయక చవితి నిర్వహణ(restrictions on ganesh festival)పై సీఎంకు బహిరంగ లేఖ రాసినట్లు తెలిపారు. పిల్లలకు పాఠశాలలు, మద్యం దుకాణాలు తెరిచినప్పుడు కొవిడ్ నిబంధనలు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. మున్సిపల్ ట్రాక్టర్​లో వినాయక విగ్రహాలు తరలించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపల్లి అక్రమ మైనింగ్(kondapalli mining)​పై నా ప్రశ్నకు ఎమ్మెల్యే వసంత్ కృష్ణ ప్రసాద్ నుంచి నేటికి సమాధానం చెప్పలేదన్నారు. తెలిపారు. కొండపల్లి అడవి తవ్వకాల్లో ఏ తప్పు చేయకుటే జరిమానాలు ఎందుకు కట్టారని నిలదీశారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే..
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే వినాయక చవితి వేడుకలపై వైకాపా ప్రభుత్వం ఆంక్షలు(restrictions on Vinayaka Chavithi celebrations) విధించిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర(kollu ravindra) ధ్వజమెత్తారు. "చవితి ఉత్సవాలు జరుపుకోడానికి వీలు లేదంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి హిందువుల మనోభావాలంటే ఎంత చులకనో అర్థమవుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని నిషేధాజ్ఞలు మన రాష్ట్రంలోనే ఎందుకు. చేతకాని పరిపాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నిబంధనలు పెడుతున్నారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు అనుమతులివ్వాలని.. 175నియోజకవర్గాల తెదేపా నేతలు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ(letters to cm jagan) రాస్తున్నాం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. చవితి వేడుకలు నిర్వహించి తీరుతాం. వైకాపా సభలు, ఊరేగింపులకు అడ్డురాని కరోనా నిబంధనలు.. వినాయక చవితికే వర్తిస్తాయా. చెత్త తరలించే వాహనంలో గణేశ్​ ప్రతిమలు తరలించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మత్స్యకారుల గొంతు నొక్కేలా జారీ చేసిన 217జీవోపై మంత్రి సిదిరి అప్పలరాజు అసత్యాలు చెప్తున్నారు" కొల్లు రవీంద్ర విమర్శించారు.

హిందువులపై వివక్షను మానుకోవాలి: శ్రీరామ్​ తాతయ్య
వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని విజయవాడ పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు నెట్టెం రఘురాం, పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ తాతయ్య అన్నారు. ఈమేరకు జాగ్గయ్యపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. వెంటనే ఆంక్షలు తొలగించకపోతే నియోజకవర్గ కేంద్రాల్లో తెదేపా తరుఫున గణపతి పందిళ్లు ఏర్పాటు చేస్తామని నెట్టెం రఘురాం హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్​..హిందువులపై వివక్షను మానుకోవాలని.. కొవిడ్ సాకుతో సంప్రదాయాలను భంగపరిస్తే సహించబోమని శ్రీరామ్​ తాతయ్య(sriram thataiah) అన్నారు.

చెత్తబండిలో విగ్రహాల తరలింపా..?: కోవెలమూడి రవీంద్ర

గుంటూరులో నగరపాలక సంస్థ అధికారులు వినాయకుడి విగ్రహాలను చెత్త తరలించే వాహనంలో ఎక్కించడంపై తెలుగుదేశం పార్టీ ఆందోళన నిర్వహించింది. ఆ పార్టీ నేత కోవెలమూడి రవీంద్ర(Kovelamudi Ravindra) వినాయక విగ్రహాలు విక్రయించే వ్యాపారులతో మాట్లాడారు. చెత్తబండిలో విగ్రహాలు(ganesh idols) తరలించడానికి యత్నించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వెంటనే వినాయక చవితికి అడ్డంకులు తొలగించాలన్నారు. విగ్రహాల తయారీదారులకు, విక్రయించే వారికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.

చవితి ఉత్సవాలపైనే ఎందుకు ఆంక్షలు: సోమిశెట్టి వెంకటేశ్వర్లు

రాష్ట్రంలో వినాయక చవితిని జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కర్నూలు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇప్పటికే పాఠశాలలు, బార్లు, థియేటర్లు ప్రారంభమయ్యాయి.. హిందువులు జరుపుకునే చవితి ఉత్సవాలకు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మత విశ్వాసాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

వినాయక మండపాలు ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో భాజపా, విశ్వహిందూ పరిషత్, వినాయక సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ.. విజయనగరం కలెక్టరేట్ వద్ద లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో విగ్రహ తయారీదారులు నిరసన(protest against ycp govt) తెలిపారు. ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తూ... విగ్రహ తయారీదారుల ఉపాధికి ఆటంకం కల్గించిందని వ్యక్తం చేశారు.

ఇదీ చదవంది..

Fake Challans: నకిలీ చలాన్ల వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.