చంద్రబాబు గతంలో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయం విధానాన్నే.. సీఎం జగన్ కాపీ చేసి హడావుడి చేస్తున్నారని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 2001లో తెదేపా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయం వ్యవస్థను వైఎస్ రాజశేఖరరెడ్డి తొలగిస్తే.. ఇప్పుడు జగన్ తిరిగి ప్రవేశపెట్టారని ట్విట్టర్లో విమర్శించారు.
పేటీయం ఎడిట్లు చేసుకునే 'కే2'కు.. దొంగ లెక్కలు రాయడం మినహా చరిత్ర ఏమి తెలుసని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. 2001లో ఎవరి కోసం దొంగ లెక్కలు రాస్తూ కుర్చున్నావో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మీ బులుగు బ్యాచ్‌ని సంతోష పెట్టమంటూ హితవు పలికారు.
ఇదీ చదవండి:
'సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేస్తారా..ఏమిటీ ఆటవిక సంస్కృతి ?'