చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నేడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. విభజన హామీలు, పెండింగ్ సమస్యల పరిష్కారంలో అధికార వైకాపా కేంద్రాన్ని ఒప్పించటంలో విఫలమైందన్న విషయాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని తెలుగుదేశం భావిస్తుంది. 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా.. తెదేపా ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. ఓటింగ్ సరళిపై సోమవారం (ఈనెల18న) ఉదయం పార్టీ కేంద్రాలయంలో ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి