గిరిజన సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైకాపాకు లేదని గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. ఎస్టీ కార్పొరేషన్ నిధులు, సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయన్నారు. కార్పొరేషన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించడం సిగ్గుచేటని, గిరిజన యువకుల స్వయం ఉపాధికి గతంలో ఇన్నోవా కార్లను ఇచ్చినట్లు తెలిపారు. ఏడాదిన్నరగా కార్లు మంజూరైనా ఇవ్వకపోవడం సంక్షేమమా? అని నిలదీశారు. గిరిజన మహిళలపై జరిగే అత్యాచారాలపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పేరుతో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు లాక్కోవడం సంక్షేమమా? అన్నారు.
ఇదీ చదవండి: సోమవారం రైతు సంఘాల నేతల నిరాహార దీక్ష