రాష్ట్రంలో కరోనా నియంత్రణపై.. వైకాపా నేతలు వాస్తవాలు దాస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ధ్వజమెత్తారు. ప్రజలు ఆక్సజన్ లేక ప్రాణాలు కోల్పోయే దుస్థితి రావటం ముఖ్యమంత్రి జగన్ చేతకాని తనమేనన్నారు. రాష్ట్రంలో వైద్యం అందక.. పొరుగు రాష్ట్రాలకు ప్రజలు తరలిపోతుంటే.. ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల రూపంలో రూ.లక్షలు దోచుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రజల ప్రాణాలు పట్టించుకోని సీఎం జగన్ రెడ్డి.. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు మేలు చేసే పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర పరిణామాలు దృష్ట్యా.. వెంటనే ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలని మంతెన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: