తుగ్లక్ సీఎం జగన్ డిక్షనరీలో యూ టర్న్‌తో పాటు కొత్తగా జే టర్న్ వచ్చి చేరిందని.. తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎద్దేవా చేశారు. నామినేటెడ్ పోస్టులలో అత్యధికం ఒకే సామాజిక వర్గానికి కేటాయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కొన్ని పత్రికలపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. వారికి రావలసిన ప్రకటనల డబ్బులు నిలిపేస్తోందని ఆరోపించారు. జగన్ తుగ్లక్ చర్యలను అనేక జాతీయ పత్రికలు ఎండగట్టాయని విమర్శించారు.
ఇవీ చదవండి.... 'ఏడాది పాలనలో అప్పులు తప్ప.. అభివృద్ధి శూన్యం'