రైతులు, రైతుకూలీలు, చేతివృత్తుల వారు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. గిట్టుబాటు ధరలేక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్‌తో కరోనా తగ్గిపోతుందన్న ముఖ్యమంత్రికి వ్యాక్సిన్‌తో పనేమిటో సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు. కరోనా ఉద్ధృతంగా ఉన్నప్పుడు ప్రాణాంతకం కాదన్న వ్యక్తి.. ఇప్పుడు ప్రమాదం అని చెప్పడం సిగ్గుచేటన్నారు. పల్లెల్లో ఎన్నికలు నిర్వహిస్తే, పట్టణాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి ఉన్న ఇబ్బందేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎన్నికలకు వెళ్లే ధైర్యముంటే, కోర్టుల్లో వేసిన పిటిషన్లను తక్షణమే ఉపసంహరించుకొని, ఎన్నికలకు సిద్ధం కావాలని అశోక్‌బాబు సవాల్ చేశారు.
ఇదీ చదవండి: రూ.89కే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్!