ETV Bharat / city

'రేషన్ బియ్యం కూడా కులాల వారీగా ఇస్తారేమో' - తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు

ప్రభుత్వ వ్యవహారశైలి చూస్తుంటే రేషన్ దుకాణాల్లో బియ్యం కూడా కులాల వారీగా ఇస్తారేమోనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు ఎద్దేవా చేశారు. కాపు సంక్షేమానికి రూ. 4వేల కోట్లు కేటాయించామని చెప్తున్న ప్రభుత్వం.. దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

tdp mlc ashok babu about kapu corporation funds
అశోక్ బాబు, తెదేపా ఎమ్మెల్సీ
author img

By

Published : Jun 27, 2020, 7:42 PM IST

కులాల వారీగా బడ్జెట్​ను విడదీసే ప్రక్రియకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు విమర్శించారు. కాపు సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గానికి ఎంతో మేలు చేశామని మంత్రి కన్నబాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ వర్గం తరఫున మాట్లాడే నైతిక అర్హత మంత్రికి లేదని మండిపడ్డారు.

ప్రభుత్వ పథకాలు ఏవైనా ఆయా కార్పొరేషన్ల ద్వారానే అందిస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కాపులకు కేటాయించిన దానిలో అమ్మఒడి, రైతు భరోసాను ఎందుకు కలిపారని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవహారశైలి చూస్తుంటే రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం కూడా కులాల వారీగా ఇచ్చేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.

'బడ్జెట్​ను శాఖల వారీగా కేటాయించడం ఆనవాయితీ. అయితే వైకాపా ప్రభుత్వం కులాల వారీగా విడదీసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కాపు సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా రూ. 4వేల కోట్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అయితే అందులో రైతు భరోసా, అమ్మ ఒడిలను ఎందుకు కలిపారు. కాపు నేస్తం కేవలం 2 లక్షల మంది మహిళలకే ఇచ్చారు. అంటే మన రాష్ట్రంలో కాపుల్లో 2 లక్షల కుటుంబాలే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయా! మిగిలిన కాపులందరూ సుఖంగా ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం' - అశోక్ బాబు, తెదేపా ఎమ్మెల్సీ

ఇవీ చదవండి...

కరోనా భయం: బస్సు డ్రైవర్ సీటు చుట్టు రక్షణ కవచం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.