చేపలు , రొయ్యలను విక్రయించేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రాసిన లేఖను హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. జస్టిస్.యు. దుర్గాప్రసాదరావు, జస్టిస్ యం. గంగారావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ప్రైవేటు ఆక్వా ఎగుమతిదారుల చేతిలో రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వమే విక్రయించి.... ఎగుమతి చేసే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఈనెల 14న ఎమ్మెల్యే హైకోర్టుకు లేఖ రాశారు.
ఇవీ చదవండి