ETV Bharat / city

80 నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్‌: తెదేపా - అక్రమ మైనింగ్ పై తెదేపా

కొండపల్లిలో అక్రమ మైనింగ్, విశాఖలో బాక్సైట్‌ తవ్వకాలతో వైకాపా నేతలు రూ.వేల కోట్లు దోచుకుంటున్నారని తెదేపా ధ్వజమెత్తింది. రాష్ట్రంలోని 80 నియోజక వర్గాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని మండిపడింది. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం సోమవారం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

tdp meeting
tdp meeting
author img

By

Published : Aug 3, 2021, 7:56 AM IST

రాష్ట్రంలోని 80 నియోజకవర్గాల పరిధిలో అక్రమ మైనింగ్‌ సాగుతోందని, ఇసుక మాఫియా రెచ్చిపోతోందని తెదేపా మండిపడింది. కొండపల్లిలో అక్రమ మైనింగ్‌, విశాఖలో బాక్సైట్‌ తవ్వకాలతో వైకాపా నేతలు రూ.వేల కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తింది. కర్నూలు జిల్లాలో ఇనుప ఖనిజం, నెల్లూరు జిల్లాలో సిలికా దోపిడీ సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమాలను ప్రశ్నించే వారిని భయపెట్టాలనే కుట్రతోనే మాజీ మంత్రి దేవినేని ఉమాపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టింది. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం సోమవారం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. పెట్రోలు, డీజిలు ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.

సమావేశంలో చర్చించిన అంశాలు.. నిర్ణయాలివీ..

  • ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులతో వేధించడంతోపాటు ఆయనను సర్వీసు నుంచి తొలగించాలని సిఫార్సు చేయడం దుర్మార్గం. అధికారులను వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసుశాఖలో సిబ్బందికి పోస్టింగు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వీఆర్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వ చర్యలతో వేతనాలు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు.
  • రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలను పాటించకుండా ఏపీఎస్‌డీసీ ద్వారా అప్పులు తెచ్చి ఉద్దేశపూర్వకంగా మోసం చేసింది. ఇది రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధం. జగన్‌ తన కంపెనీల్లో పెట్టుబడుల కోసం ఏం చేశారో.. ఇప్పుడు అప్పుల విషయంలోనూ అధికారులతో అదే చేయిస్తున్నారు. వీటిపై ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్రం లేఖ రాయడం జగన్‌ తీరుకు నిదర్శనం.
  • వివేకా హత్యకేసులో అసలు నిందితులెవరో బహిరంగ రహస్యం. సునీతారెడ్డి ఇచ్చిన జాబితాలోని వారిని ఇంకా ఎందుకు విచారించలేదు?
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రభుత్వం అడ్డుకోవాలి. స్టీల్‌ప్లాంటు విషయంలో సమస్యను పక్కదారి పట్టించేందుకు కుట్రచేస్తూ వైకాపా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.
  • వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి. హోంమంత్రిని డమ్మీగా మార్చారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయంపై పెద్దఎత్తున ఉద్యమించాలి.
  • ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరితే మంత్రులు ఎదురుదాడి చేస్తూ బూతులు మాట్లాడుతున్నారు. వీరిని ప్రజలు చీత్కరించుకుంటున్నారు.
  • బీసీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లించి విద్యాదీవెనకు ఇచ్చారు.
  • జగన్‌ పాలనపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత పెరిగింది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పోరాడుతూ జగన్‌ విధానాలను ఎండగట్టాలి.

ఇదీ చదవండి: విశాఖలో అడుగు పెట్టనివ్వం: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.