ETV Bharat / city

ప్రచార ఆర్భాటాలే తప్ప.. ప్రజల కష్టాలు పట్టడం లేదు: నిమ్మల - తెదేపా నేత నిమ్మల రామానాయుడు తాజా వార్తలు

కరోనాతో చనిపోయిన కుటుంబాలకు రూ.10లక్షలు, కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారికి రూ.50లక్షలను ప్రభుత్వం ఇవ్వాలని తెదేపా శాసనసభపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు సాయం చేయకుండా ప్రకటనలకు మాత్రం వేల కోట్లల్లో ఖర్చు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

nimmala rama naidu
తెదేపా నేత నిమ్మల రామానాయుడు
author img

By

Published : Jun 15, 2021, 5:17 PM IST

దేశంలోని అనేక రాష్ట్రాలు పేదలకు సాయం చేస్తుంటే.. వైకాపా ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని తెదేపా శాసనసభపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు నిలదీశారు. కొవిడ్ సంక్షోభంలో చిక్కుపోయిన ప్రజల 10 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు సాయం చేయకుండా ప్రకటనలకు మాత్రం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోందని ధ్వజమెత్తారు.

ప్రతి తెల్లరేషన్ కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయటంతో పాటు.. కరోనాతో వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ.10లక్షలు, కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారికి రూ.50లక్షలు ఇవ్వాలని అన్నారు. ఆక్సిజన్ కొరతతో చనిపోయిన వారికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని.. కరోనాతో చనిపోయిన వారి దహనసంస్కారాలకు రూ.15వేలను ప్రభుత్వం వెంటనే అందచేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారించకపోతే బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల చేసిన సీఎం

కరోనా టీకాతో దేశంలో తొలి మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.