ETV Bharat / city

ముఖ్య నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెదేపా నేతల ధ్వజం - వివిధ జిల్లాల్లో తెదేపా నేతలపై అక్రమ కేసుల వార్తలు

తెలుగుదేశం ముఖ్య నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆ పార్టీ అగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయకుండా భయపెడుతున్న పోలీసులపై ప్రైవేటు కేసులతో చెక్‌ పెట్టాలని అధిష్ఠానం భావిస్తోంది. ఇదే సమయంలో పార్టీ శ్రేణులు నిరుత్సాహపడకుండా వారికి ధైర్యం చెబుతూనే.. నిరసన కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. మాజీమంత్రి దేవినేని ఉమా అరెస్టు తదనంతర పరిణామాలపై ముఖ్యనేతలతో చర్చించిన చంద్రబాబు.. భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి సారించారు.

tdp leaders
తెదేపా నేతలు
author img

By

Published : Jul 30, 2021, 1:02 PM IST

అక్రమ కేసులు పెడుతున్నారని తెదేపా నేతలు ధ్వజం

వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం ముఖ్యనేతలపై నమోదైన వరుస కేసులను ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. కొందరు పోలీసు అధికారులు.. ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో అలాంటి వారిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు..వారిపై ప్రైవేటు కేసులు పెట్టేందుకు పార్టీ న్యాయ విభాగాన్ని బలోపేతం చేసేలా అధినేత చంద్రబాబు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాల వారీగా పార్టీ ముఖ్యనేతలపై నమోదైన కేసుల వివరాలపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడుపై అనేక కేసులు నమోదయ్యాయి. అదే జిల్లాకు చెందిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు పై రామతీర్థం ఘటనలో కేసు నమోదుతోపాటు.. అరెస్టు చేసి బెయిల్ పై విడిచిపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి అధినేత చంద్రబాబుపైనా కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోని మరో సీనియర్ నేత కూన రవికుమార్‌పై వరుసగా కేసులు పెట్టారు. విశాఖ జిల్లాలో లేటరైట్ మాటున బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయంటూ క్షేత్రస్థాయి పర్యటన కు వెళ్లిన అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, నక్కా ఆనంద్ బాబు, అనితపైనా కేసులు నమోదు చేశారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హత్యానేరం కింద అరెస్టై.... బెయిల్‌ పై బయటకు వచ్చారు. ఓ వివాహ వేడుకకు హాజరైన అంశంపై ఇదే జిల్లాలో శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, చినరాజప్పతో పాటు మరికొందరు నేతలపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని అధిష్ఠానం భావిస్తోంది. కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ అరెస్టు, జైలుకు పంపడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే జిల్లాకు చెందిన మాజీమంత్రి కొల్లు రవీంద్రపైనా అనేక కేసులు పెట్టారు. గుంటూరు జిల్లాలో సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ కేసులో అరెస్టై.. బెయిల్ పై బయటకు వచ్చారు. మరోనేత ఆలపాటి రాజాపైనా ఇటీవల వివిధ అంశాలపై కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డిపైనా కేసులున్నాయి. చిత్తూరు జిల్లాలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల ప్రచార సమయంలో లోకేశ్‌తోపాటు.. పలువురిపై నా పోలీసులు కేసులు పెట్టారు.

రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలతో అధినేత చంద్రబాబుపై కేసు పెట్టి సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది. కర్నూలు జిల్లాలో డెల్టా వేరియంట్ పై అసత్య ప్రచారమంటూ చంద్రబాబుపై మరో కేసు పెట్టిన పోలీసులు.. నోటీసులు జారీ చేసే వరకు వెళ్లి వెనక్కు తగ్గారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హత్యాయత్నం కేసులో జైలు కైళ్లి వచ్చారు. అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్ రెడ్డిపైనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ప్రోద్భలంతో కొంతమంది పోలీసులు ఉద్యోగ ధర్మం మరచి తమవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యనేతల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్ తీవ్రత తగ్గినందున కేసులకు భయపడకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయి ఆందోళనలు కొనసాగించేలా కార్యక్రమాలు రూపొందించాలని అధినేత చంద్రబాబు పార్టీ నేతల్ని ఆదేశించారు. ఇందుకనుగుణంగా ఇటీవల రహదారుల మరమ్మతులు, రైతులకు ధాన్యం బకాయిల చెల్లింపు, నిత్యావసర ధరల పెంపు వంటి అంశాలపై చేపట్టిన నిరసనలకు మంచి స్పందన వచ్చిందనే అభిప్రాయం అధినేత సమావేశంలో వ్యక్తమైంది.

ఇదీ చదవండి

Jagan bail cancel petition: జగన్ బెయిల్‌ రద్దుపై సీబీఐ కోర్టులో ముగిసిన విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.