ETV Bharat / city

'సంక్రాంతి నాటికి ఇళ్లు ఇవ్వకుంటే ఆక్రమించుకుంటాం' - విజయవాడలో ఇళ్ల లబ్ధిదారులతో కలిసి గద్దే ధర్నా

తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను వైకాపా ప్రభుత్వం ఇప్పటికీ లబ్ధిదారులకు అందించకపోవడంపై ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ నిరసన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ నాటికి వాటిని ఇవ్వకుంటే లబ్ధిదారులు ఆక్రమించుకునేలా చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.. ప్రభుత్వంపై మండిపడ్డారు. వైకాపా పాలనలో ఒక్క ఇల్లూ నిర్మించలేదని విమర్శించారు.

protest for houses
ఇళ్ల కోసం ధర్నా చేస్తున్న తెదేపా నేతలు
author img

By

Published : Nov 6, 2020, 5:38 PM IST

విజయవాడలో...

గత ప్రభుత్వం కేటాయించిన వారికి వెంటనే ఇళ్లు అప్పగించాలంటూ.. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆందోళన చేపట్టారు. మహిలా లబ్ధిదారులతో కలిసి ఆయన కార్యాలయంలో నిరసనకు దిగారు. ఉచితంగా ఇళ్లు ఇస్తామని వాగ్ధానాలు చేసిన జగన్.. అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. సంక్రాంతి నాటికి తెదేపా హయంలో నిర్మించి, మంజూరు చేసిన ఇళ్లను అందించకపోతే వాటిని అక్రమించుకుంటామని హెచ్చరించారు. గృహప్రవేశానికి సిద్దంగా ఉన్న ఇళ్లకు విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు, రోడ్ల సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఇళ్లు మంజూరు కాని వారికి కట్టిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు వాటన్నిటినీ ఉచితంగా ఇవ్వాలన్నారు.

నందిగామలో...

అర్హులైన పేదలందరికీ పారదర్శకంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత తంగిరాల సౌమ్య డిమాండ్‌ చేశారు. 'నా ఇల్లు నా సొంతం - నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి'లో భాగంగా.. కృష్ణా జిల్లా నందిగామ మండలం తక్కెళ్ళపాడులో నేతలతో కలిసి నిరసన తెలిపారు. 2014 తర్వాత 20 లక్షల ఇళ్లను మంజూరు చేయించిన ఘనత చంద్రబాబుదన్నారు. నియోజకవర్గంలో 3 కోట్ల మేర ఇళ్ల బిల్లుల బకాయిలు చెల్లింపు ఇప్పటికీ పూర్తికాలేదని విమర్శించారు. తెదేపా హయాంలో మంజూరు చేసిన టిడ్కో జీ+3 ఇళ్ళు 2,496 కాగా.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నా అని ఎద్దేవా చేశారు. 16 నెలల పాలనలో ఒక్క ఇల్లూ నిర్మించలేదని మండిపడ్డారు. ఆమోదయోగ్యం కానిచోట్ల స్థలాలు సేకరించి, వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల పేరుతో ప్రతి గ్రామంలో అధికార పార్టీ నాయకులు కోట్లకు కోట్లు కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మొండి వైఖరి మార్చుకుని.. పేదలకు వెంటనే పట్టాలను అందచేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'వారివన్నీ దోచుకొని దాచుకుందామనే ఆలోచనలే'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.