ETV Bharat / city

tdp on new districts: 'అమరావతికో న్యాయం.. జిల్లా కేంద్రాలకో న్యాయమా?' - tdp leaders on news districts

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తీరుపై తెదేపా నేతలు విమర్శలు చేశారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం.. జిల్లా కేంద్రాలు మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని తెదేపా సీనియర్ నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. ప్రజల సౌలభ్యం కోసం కాకుండా.. విద్వేషాలు పెంచి పబ్బం గడుపుకోటానికి చేసినట్లు ఉందని అనుమానం కలుగుతోందని నక్కా ఆనంద్ బాబు అనుమానం వ్యక్తం చేశారు.

కొత్త జిల్లాల ప్రతిపాధనలపై తెదేపా నేతలు
కొత్త జిల్లాల ప్రతిపాధనలపై తెదేపా నేతలు
author img

By

Published : Jan 28, 2022, 4:31 PM IST

రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం.. జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైకాపా ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని తెదేపా సీనియర్ నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం.. జిల్లా కేంద్రాలు మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని ఆయన ప్రశ్నించారు. డైవర్షన్ రాజకీయాలకు వైకాపా బ్రాండ్ అంబాసిడర్​గా మారిందని ఆంజనేయులు దుయ్యబట్టారు.

విజయవాడకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని అన్ని పార్టీలు కోరుతున్నాయని, వెంటనే రంగా పేరు పరిగణనలోకి తీసుకుని ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఎస్వీ రంగారావు పేరు పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకు పెట్టాలని అవసరమైతే దీనికోసం ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు.

జిల్లాల విభజన ప్రక్రియను ప్రహసనంలా మార్చారని.. తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ప్రజల సౌలభ్యం కోసం కాకుండా.. విద్వేషాలు పెంచి పబ్బం గడుపుకోటానికి చేసినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా తెనాలితో ముడిపడి ఉన్న వేమూరు నియోజకవర్గాన్ని.. బాపట్ల జిల్లాలో కలపడం ఏంటని ప్రశ్నించారు. విజయవాడకు ఎన్టీఆర్‌ పేరు పెట్టడాన్ని.. తెలుగుదేశం నేత బొండా ఉమ స్వాగతించారు. అయితే ఎన్టీఆర్ పుట్టిన తూర్పు కృష్ణా ప్రాంతానికి ఆయన పేరు పెడితే బాగుండేదన్నారు. అలాగే విజయవాడకు వంగవీటి రంగా పేరు, పశ్చిమగోదావరి జిల్లాకు ఎస్వీ.రంగారావు పేరు పెట్టాలని ఉమ కోరారు.

ఇదీ చదవండి: New Districts in AP: రాజంపేటలో ఆందోళనలు.. జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.