ETV Bharat / city

'పరిషత్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం' - పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు

పరిషత్ ఎన్నికలు నిలుపుదల చేస్తూ..హైకోర్టు ఇచ్చిన స్టే ప్రభుత్వానికి మరో చెంపపెట్టు అని తెదేపా నేతలు వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్నే అమలు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు.

TDP Leaders on Court Judgement over parishad elections
పరిషత్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం
author img

By

Published : Apr 6, 2021, 9:48 PM IST

పరిషత్ ఎన్నికలను నిలుపదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య విజయమని తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్నే అమలు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన రోజే ఎస్ఈసీ ఎన్నికల తేదీని ప్రకటించటంలో అర్థం లేదని విమర్శించారు.

పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ వచ్చేలా తెదేపా కృషి చేస్తుందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన స్టే ప్రభుత్వానికి మరో చెంపపెట్టని పేర్కొన్నారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా.. ప్రభుత్వం తన పంథా మార్చుకోవట్లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల బహిష్కరణపై చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు.

ఇదీ చదవండి:

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.