విశాఖలో పోలీసుల తీరుపై గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు - గవర్నర్‌ను కలిసిన తెదేపా ప్రతినిధుల బృందం
విశాఖపట్నంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన సమయంలో.. పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. ఉదయం గవర్నర్‌ను కలిసిన తెదేపా నేతలు.. వినతిపత్రం అందజేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 11 మంది తెదేపా ప్రతినిధులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.