తెదేపాను వీడనున్నట్టు ప్రకటించిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో... తెదేపా నేతలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ చర్చలు జరిపారు. ఎంపీ కేశినేని నివాసంలో మూడున్నర గంటలపాటు మంతనాలు చేశారు. అక్రమ కేసుల వల్ల తాను, తన వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వంశీ వారికి వివరించారు. తెదేపాలోనూ ఉన్న అంతర్గత ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు. నిర్ణయం తీసుకున్నాననీ.. ఇక వెనకడుగు వేయలేనని వంశీ స్పష్టంచేశారు. తెదేపాలో ఉంటేనే మంచి భవిష్యత్ ఉంటుందనీ.. కేసులపై పోరాడేందుకు అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ మొత్తం అండగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు. పార్టీలో ఉన్న అంతర్గత ఇబ్బందుల పరిష్కారానికి చంద్రబాబు తరఫున హామీ ఇచ్చారు. ఎటూ తేల్చుకోలేకపోతున్నానని వల్లభనేని వంశీ తెదేపా నేతలతో చెప్పినట్లు సమాచారం. ఈ చర్చల వివరాలను నాని, కొనకళ్ల నారాయణ చంద్రబాబుకు నివేదించారు.
ఇవీ చదవండి: