కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త కోనేరు నాని ఆధ్వర్యంలో... విజయవాడ గ్రామీణ మండలం నున్న, రామవరప్పాడు ప్రాంతాల్లో నీట మునిగిన వరి పంటలను తెదేపా బృందం సందర్శించి.. రైతుల నుంచి వివరాలు సేకరించారు. ఇప్పటికే కౌలు రైతులు ఎకరానికి పాతిక వేల రూపాయలు ఖర్చుపెట్టి వరిసాగుకు ఉపక్రమించారని... తుపాను కారణంగా ఆ పంటలు నీటమునిగి పూర్తిగా దెబ్బతిన్నాయని వారు పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం సహాయం అందించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను ఇప్పటివరకు వ్యవసాయశాఖాధికారులు పరిశీలన చేయకపోవటం వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కోనేరు నాని విమర్శించారు.
ఇదీ చదవండి: