గుడివాడలో క్యాసినో నిర్వహణ అంశంపై తెలుగుదేశం నిజనిర్థారణ కమిటీ సభ్యులు డీజీపీని కలిసేందుకు సమయం కోరారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి సహకరిస్తూ.. పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఐజీ, కలెక్టర్ ఇలా ఒక్కో పైస్థాయి అధికారికి వరస ఫిర్యాదులు చేస్తున్నారు.
వీటిపై ఎలాంటి స్పందనా లేదని భావిస్తున్న నిజనిర్థారణ కమిటీ ఇవాళ డీజీపీకి ఫిర్యాదు చేసి, ఫలితం లేకుంటే న్యాయస్థానం తలుపుతట్టాలని భావిస్తోంది. గుడివాడ పర్యటనకు సంబంధించి 26 మందికి పైగా తెలుగుదేశం నాయకులపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేయటాన్ని నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
చంద్రబాబుకు కమిటీ నివేదిక...
గుడివాడలో క్యాసినో నిర్వహణపై తెదేపా అధినేత చంద్రబాబుకు నిజనిర్ధరణ కమిటీ నివేదిక సమర్పించింది. క్యాసినో, జూదం, పేకాట, అసభ్యకర నృత్యాలు జరిగినట్లు నివేదికలో తెలిపింది. రూ.500 కోట్లు చేతులు మారాయని వెల్లడించింది.
ఇదీచదవండి: GUNTUR MAYOR : 'రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి జిన్నా టవర్ అంశం'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!