ETV Bharat / city

'కొడాలి నానికి చంద్రబాబు, లోకేశ్​ను విమర్శించే అర్హత లేదు' - మంత్రి కొడాలి నానిపై తేదేపా నేతల మండిపాటు

తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​లపై.. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు రేషన్ బియ్యాన్ని సకాలంలో ఇవ్వలేని మంత్రి కొడాలి నానికి.. ఐటీ శాఖ మంత్రిగా 35 వేల ఉద్యోగాలు సాధించిన లోకేశ్ ను విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాణయరాజు ధ్వజమెత్తారు.

tdp
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించిన తెదేపా నేతలు
author img

By

Published : Apr 10, 2021, 9:51 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​లపై.. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తెదేపా నేతలు ఖండించారు.

'లోకేశ్ ను విమర్శించే అర్హత కొడాలి నానికి లేదు'

ప్రజలకు రేషన్ బియ్యం కూడా సకాలంలో ఇవ్వలనేని మంత్రి కొడాలి నానికి, ఐటీ శాఖ మంత్రిగా 35వేల ఉద్యోగాలిచ్చిన లోకేశ్​ను విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాణయరాజు ధ్వజమెత్తారు. "తెదేపా మళ్లీ అధికారంలోకి రాగానే రాష్ట్రం వదిలి పారిపోయి, అంతరాష్ట్రాల్లో తలదాచుకునే మొదటి వ్యక్తి కొడాలి నాని. కేంద్రంలో ప్రధానిని నిర్ణయించిన చరిత్ర చంద్రబాబుకు ఉంటే, కేసుల మాఫీ కోసం కాళ్లు మొక్కే ఘనత జగన్ రెడ్డిది. గుడివాడలో కొడాలి నానిని ఓడించేందకు కార్యకర్త చాలు" అని విమర్శించారు.

'ఓటమి భయంతోనే ప్రచార బాట పట్టారు'

ఉపఎన్నిక ప్రచారానికి రానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఓటమి భయంతోనే తిరుపతి బాట పట్టారని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేశ్​ లకు వస్తున్న ప్రజాదరణతో వణుకు పుట్టి.. తిరుపతి ప్రచారానికి జగన్ దారి వెతుకుతున్నారని విమర్శించారు. జగన్ కదిలే ముందు మోగే సైరన్ లా మాట్లాడటం కొడాలి నానికి ఆనవాయితీ. దమ్ముంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి" అని ఓ ప్రకటనలో సవాల్ విసిరారు.

'నిజాయితిని నిరూపించుకోవాలి'

వివేకానంద రెడ్డి హత్య కేసులో తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని.. ప్రమాణం చేయలేక పారిపోయిన సీఎం జగన్​కు.. మంత్రి కొడాలి నాని వత్తాసు పలకటం విడ్డూరంగా ఉందని.. తెదేపా అధికార ప్రతినిధి ఎన్.బి.సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. "రాజకీయ ఊడిగం చేసే కొడాలి నానికి లోకేశ్ ని విమర్శించే స్థాయి లేదు. ధైర్యం ఉంటే ఈ నెల 14న తిరుపతి వస్తున్న జగన్ తో కొడాలి నాని ప్రమాణం చేయించాలి" అని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

దిగజారుడు రాజకీయాలు తగదు: మంత్రి ఆదిమూలపు సురేష్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.