చంద్రబాబు విశాఖలో పర్యటిస్తే ముఖ్యమంత్రి జగన్‌కు అంత భయమెందుకో చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు గౌరవించి ప్రభుత్వ అనుమతులతో ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళ్తుంటే విమానాన్ని ఎందుకు రద్దు చేయించారని నిలదీశారు. రంగనాయ కమ్మ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ప్రశ్నలనే.. న్యాయస్థానం ప్రభుత్వాన్ని అడిగిందని ఉమా ట్విట్టర్లో పేర్కొన్నారు.
![tdp leaders fires on jagan and ycp goverment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7337691_382_7337691_1590390746911.png)
ఒక్క మాస్కుతో పోయేదానికి..
ఎవరు ఎంతలా ఆపుదామని ప్రయత్నించినా చంద్రబాబు అమరావతికి వస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైద్యుడు సుధాకర్ విషయంలో మాస్కులు ఇస్తే పోయేదానికి.. సీబీఐ దాకా తెచ్చిన జగన్ సలహాదారుల గొప్పతనాన్ని అభినందించక తప్పడంలేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయల జీతం పొందుతూ, జగన్ ప్రభుత్వానికి వారు అందిస్తున్న సేవలకు జోహార్లంటూ ట్వీట్ చేశారు.
![tdp leaders fires on jagan and ycp govermenttdp leaders fires on jagan and ycp goverment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7337691_973_7337691_1590390776398.png)
ఇవీ చదవండి... తితిదే ఛైర్మన్‌కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ