ETV Bharat / city

tdp leaders fires on cm jagan: సీఎం జగన్​పై తెదేపా నేతల ఆగ్రహం - tdp leaders fire achanta sunitha on cm jagan

tdp leaders fires on cm jagan: వాతావరణ శాఖ ఇచ్చిన నోటీసులు పట్టించుకోకపోవడం వల్లే.. నేడు వరదలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక కేంద్రం నుండి వరద సాయం కింద.. రూ. 3205 కోట్ల నిధులు వచ్చాయని.. ఆ లెక్కలన్నీ చెప్పాలని డిమాండ్ చేశారు.

tdp leaders fires on cm jagan
సీఎం జగన్​పై తెదేపా నేతల ఆగ్రహం
author img

By

Published : Nov 30, 2021, 4:54 PM IST

tdp leaders fires on cm jagan: నవంబర్ 17, 18న.. కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ నోటీసు ఇచ్చిన రోజు.. సీఎం బీఏసీలో కూర్చుని చంద్రబాబుని ఎగతాళి చేశారని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. వాతావరణ శాఖ ఇచ్చిన నోటీసులు పట్టించుకోకపోవడం వల్లే.. నేడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. సీఎం నిర్లక్ష్య ధోరణి కారణంగా.. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయని ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయ్యాక కేంద్రం నుండి వరద సాయం కింద.. రూ. 3205 కోట్ల నిధులు వచ్చాయని.. ఆ లెక్కలన్నీ చెప్పాలని డిమాండ్ చేశారు. నారా భువనేశ్వరి గురించి మాట్లాడే అర్హత వైకాపా నేతలకు లేదన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వహించిన సీఎం జగన్.. ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.

tdp leader ramanaidu : 5లక్షల మంది విద్యార్థులకు అన్యాయం

ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక.. నాణ్యమైన విద్య అనేది విద్యార్థులకు మిథ్యగా మారిందని.. తెదేపా పొలిట్ బ్యూరోసభ్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-2019 మధ్య.. చంద్రబాబు ప్రభుత్వం 16లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్ అందిస్తే, సీఎం జగన్ నేడు ఆ సంఖ్యను 11లక్షలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లింపులకు.. జగనన్న విద్యాదీవెన అని పేరుపెట్టిన.. ముఖ్యమంత్రి 5లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకుండా చేసి.. వారు ఆకలితో అలమటించేలా చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని నిలదీశారు. మద్యంపై ఆదాయం వస్తుందని దాన్ని ప్రోత్సహిస్తున్న జగన్ ప్రభుత్వం.. వ్యవసాయంపై ఆదాయం లేదని రాష్రంలో వరివేయొద్దనే దుస్థితికి దిగజారిందని దుయ్యబట్టారు.

ఆడబిడ్డల పొదుపు సొమ్ముకి ఎసరు పెట్టారు

అభయహస్తం పథకం కింద ఆడపడుచులు దాచుకున్న.. రూ.2,118కోట్లను ఎల్ఐసీ నుంచి సెర్ఫ్​కు బదలాయించడం ద్వారా.. ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారని తెదేపా అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత నిలదీశారు. సదరు పథకం కింద గతంలో మహిళలకు లభించిన ప్రయోజనాలు యథావిధిగా లభిస్తాయనే హామీని ఈ ప్రభుత్వం ఇవ్వగలదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ఆడబిడ్డల పొదుపు సొమ్ముకి ఎసరు పెట్టారని ఆరోపించారు. మహిళోద్ధారకుడిని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి.. తన పాలనలో మహిళలకు చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ, తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

వరద బాధితులకు సహాయం అంతంత మాత్రంగానే..

వరదలతో రాయలసీమ అతలాకుతలమైతే.. సహాయం అంతంత మాత్రంగానే ఉందని.. తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 ఎమ్మెల్యేలు ఉన్న సీఎం.. విందులు, వినోదాల్లో చేసుకుంటున్నారని, 23మంది ఎమ్మెల్యేలు ఉన్న వ్యక్తి జనాల్లో తిరుగుతున్నారన్నారు. రూ.6వేల కోట్లు నష్టం జరిగితే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలిస్తాననడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు.

ఇదీ చదవండి: Jagananna Vidyadeevena: జగనన్న విద్యా దీవెన మూడో విడత నిధులు విడుదల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.