ETV Bharat / city

TDP Leaders Fired on YCP : "వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలే పాతరేస్తారు" - మహిళలపై వేధింపులపై వంగలపూడి అనిత వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా నేతలు (TDP Leaders fired on YCP government) మండిపడ్డారు. రెండున్నరేళ్ల పాలనలో వైకాపా నేతలు ప్రజలకు చేసిందేంటని నిలదీశారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న నేతలు.. జగన్ సర్కారురు జనం బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు.

TDP Leaders Fired on YCP
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతల మండిపాటు
author img

By

Published : Nov 25, 2021, 7:05 PM IST

రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తెదేపా నేతలు(TDP Leaders fired on YCP government) మండిపడ్డారు. రెండున్నరేళ్ల పాలనలో వైకాపా నేతలు ప్రజలకు చేసిందేంటని నిలదీశారు. మహిళలకు, ఎస్సీలకు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు.

మహిళలకు అడుగడుగునా అవమానాలే - వంగలపూడి అనిత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు
వైకాపా పాలనలో మహిళలకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆక్షేపించారు(Vangalapudi Anitha Fired on YCP government). వైకాపా కౌరవులు మహిళలను అవమానిస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. అనంతపురంలో తెలుగు మహిళా రాష్ట్ర నేతల ఇళ్లపై పోలీసుల దాడులు హేయమన్నారు. మహిళల ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేయడానికి పోలీసులకు సిగ్గు అనిపించలేదా? అని దుయ్యబట్టారు. ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నించేవారు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భార్యపై దిగజారి మాట్లాడిన నేతలకు అదనపు భద్రత కల్పించి, మహిళలను అవమానించిన వారిని ప్రశ్నిస్తే ఎదురుదాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, డీజీపీ ఎన్ని ప్రయత్నాలుచేసినా, తెలుగు మహిళల పోరాటాన్ని నిలువరించలేరని అన్నారు. వైకాపా పాలనకు జనం బుద్ధిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని అనిత అన్నారు.

రెండున్నరేళ్ల పాలనలో ఎస్సీలకు ఏం చేశారు? -కె.ఎస్. జవహర్, మాజీ మంత్రి
వైకాపా రెండున్నరేళ్ల పాలనలో ఎస్సీలకు 36 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి విశ్వరూప్ చెప్పటం జగన్ రెడ్డి దగాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి కె.ఎస్. జవహర్(Former minister Jawahar questioned on YCP ruling time) విమర్శించారు. నవరత్నాలు కాకుండా ప్రత్యేకంగా ఈ రెండున్నరేళ్లలో ఎస్సీలకు ఏం చేశారో చెప్పగలరా? అని ఆయన నిలదీశారు. 36 వేల కోట్లు ఎవరికి, ఎక్కడ ఖర్చు చేశారో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలని డిమాండ్‌చేశారు. చంద్రబాబు పాలనలోనే దళితుల సంక్షేమం, అభివృద్ది జరిగిందని స్పష్టంచేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, భూమి కొనుగోలు పథకం వంటివి నిలిపివేసి ఎస్సీల్ని ‎ఆర్థికంగా ఎదగకుండా జగన్ రెడ్డి అణచివేశారని జవహర్‌ ఆరోపించారు.

సంక్షేమ పథకాలు అమలవ్వాలంటే ప్రజలు తాగుబోతులుగా మారాలా..? -తెనాలి శ్రావణ్, మాజీ ఎమ్మెల్యే
ఎస్సీ బిడ్డలకు అమ్మఒడి రావాలంటే వారి తండ్రులు మద్యం తాగాలనే కొత్త ఆలోచనలో ప్రభుత్వముందని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ (Ex MLA Tenali Sravan Kumar on YCP rule)విమర్శించారు. మద్యాన్నిప్రజలు ఎక్కువగా తాగితేనే అమ్మఒడి, చేయూత, ఆసరా అమలవుతాయని ప్రభుత్వం అంటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పథకాల అమలు మందుబాబుల చలవా.. ప్రభుత్వ చలవా అనేది సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవ్వాలంటే ప్రజలు తాగుబోతులు కావాలని ప్రభుత్వమే చెబుతోందన్నారు. ఇసుక(Sand), మద్యం(Liquor), మాంసం9Meet), సినిమా(Cinema) టిక్కెట్లు అమ్ముతున్న ప్రభుత్వం, భవిష్యత్ లో డ్రగ్స్(Drugs), గంజాయి(Ganja) కూడా బహిరంగంగానే అమ్ముతుందని శ్రావణ్‌కుమార్‌ ఎద్దేవా చేశారు.

ప్రశ్నిస్తే దాడులు చేస్తారా -సయ్యద్ రఫీ, తెదేపా అధికారప్రతినిధి
తెదేపా కార్యకర్త షేక్. సైదా అనే ముస్లీం వ్యక్తిపై వైకాపా గూండాలు మారణాయుధాలతో నడిరోడ్డు మీద హత్యాయత్నాన్ని తెదేపా అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షంచాలని డిమాండ్(Demand to punish immediately who attacked TDP workers) చేసారు. దాడులతో భయపెట్టి మైనార్టీలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? జీవించే హక్కును కాలరాస్తారా? అని నిలదీశారు.

ప్రజలే బుద్ధి చెబుతారు -సంధ్యారాణి, పొలిట్ బ్యూరో సభ్యురాలు
మహిళలను అవమానపరిచిన జగన్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి(People will teach lesson in future to YCP) చెబుతారని పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజు దేవ్ అన్నారు. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించిన జగన్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పాచిపెంటలో గురువారం నిరసన చేపట్టారు.

ఇదీ చదవండి: PENCIL THEFT: పెన్సిల్ దొంగపై కేసు పెట్టండి.. పోలీసులకు బుడతడి అభ్యర్థన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.