ETV Bharat / city

రాష్ట్రంలో విధ్వంసక పాలన సాగిస్తూ.. హింసిస్తున్నారు..: తెదేపా

రాష్ట్రంలో విధ్వసంక పాలన సాగిస్తూ..ప్రజలను, ఉద్యోగులను హింసకు గురిచేస్తున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. అంగన్​వాడీలకు న్యాయం చేయకపోతే.. ,తన ప్రభుత్వాన్ని తానే పతనం చేసుకున్నవాడిగా ముఖ్యమంత్రి జగన్ నిలిచిపోతారని ఆక్షేపించారు. నివాస యోగ్యం కాని చోట్ల పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

తెదేపా
తెదేపా
author img

By

Published : Feb 22, 2022, 9:02 PM IST

అంగన్​వాడీలకు న్యాయం చేయకపోతే..,తన ప్రభుత్వాన్ని తానే పతనం చేసుకున్నవాడిగా ముఖ్యమంత్రి జగన్ నిలిచిపోతారని తెదేపా అంగన్​వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు. జగన్‌ తన ధనదాహంతో డ్వాక్రా వ్యవస్థను నీరుగార్చటమే కాక.. కళ్యాణమిత్ర, గోపాలమిత్ర, బీమామిత్రల కడుపుకొట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లక్షా 20 వేల మంది అంగన్​వాడీ సిబ్బంది డిమాండ్లను జగన్‌ పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న మహిళా సాధికారత, స్త్రీ శిశు సంక్షేమం ఎక్కడున్నాయో అధికార పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు చెప్పాలన్నారు.

పేదల ఇళ్లంటే సీఎం జగన్ రెడ్డికి ద్వేషమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు దుయ్యబట్టారు. పేదలు మంచి ఇళ్లల్లో ఉండటం సీఎంకు ఇష్టం లేదన్నారు. హామీ ఇచ్చినట్లుగా ఉగాది నాటికి ఎంతమందిని పేదలను కొత్త ఇళ్లలోకి పంపుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టకపోగా.., చంద్రబాబు హయాంలో నిర్మించిన వాటిని కూడా పేదలకు దక్కకుండా చేశారని విమర్శించారు. నివాస యోగ్యం కాని చోట్ల పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.

హంద్రీనీవా ప్రధాన కాలువ క్రింద సాగులో ఉన్న వేరుశనగ, ఇతర పంటలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. రబీలో ఈ కాలువ కింద అనంతపురం జిల్లా గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లో 20 వేల ఎకరాలకు పైగా వేరుశనగ, ఇతర పంటలను రైతులు సాగు చేసారని లేఖలో వివరించారు. ఒక్కో ఎకరాకు రైతులు ఇప్పటికే రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారన్నారు. ఈ లెక్కన ఒక్క వేరుశెనగ రైతులే రూ.80 కోట్లు వరకు పెట్టుబడి పెట్టారన్నారు. పంట ఆశాజనకంగా ఉన్న సమయంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా హంద్రీనీవా ప్రధాన కాలువకు నీటిని నిలిపివేయడంతో 20 వేల ఎకరాలు వేరుశెనగ పంట చేతికి రావటం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. హంద్రీనీవాకు నీరు సరఫరా చేయలేని పరిస్థితి ఉంటే.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కాలువకు నీటిని అందించడానికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలన్నారు.

ఇదీ చదవండి : Anganwadi-Asha's Protest: వారి అరెస్టు అప్రజాస్వామికం..ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.