గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో 9 ఎంపీటీసీలు గెలిచినా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎంపీపీ ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. వేలాది మంది పోలీసులను మోహరింపజేసి దుగ్గిరాల మండలంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తెనాలి శ్రవణ్‌కుమార్ జారీచేసిన విప్ పత్రాలను..... ఆ పార్టీ స్థానిక నేతలు దుగ్గిరాల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. గెలిచిన అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా తహసీల్దారు వ్యవహరిస్తున్న తీరు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ పీఠం కోసం ఎమ్మెల్యే ఆర్కే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని..... తెలుగుదేశం ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.ఎస్ రాజు ధ్వజమెత్తారు..
దుగ్గిరాలలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు: తెదేపా - tdp leader ms raju
దుగ్గిరాల మండలంలో 9 ఎంపీటీసీలు తెదేపా గెలిచినా ఎంపీపీ ఎన్నిక జరగకుండా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. వేలాది మంది పోలీసులను అడ్డుపెట్టుకుని దుగ్గిరాల మండలంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో 9 ఎంపీటీసీలు గెలిచినా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎంపీపీ ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. వేలాది మంది పోలీసులను మోహరింపజేసి దుగ్గిరాల మండలంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తెనాలి శ్రవణ్‌కుమార్ జారీచేసిన విప్ పత్రాలను..... ఆ పార్టీ స్థానిక నేతలు దుగ్గిరాల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. గెలిచిన అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా తహసీల్దారు వ్యవహరిస్తున్న తీరు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ పీఠం కోసం ఎమ్మెల్యే ఆర్కే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని..... తెలుగుదేశం ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.ఎస్ రాజు ధ్వజమెత్తారు..
ఇదీ చదవండి: నేడు కొప్పర్రులో హోంమంత్రి సుచరిత పర్యటన