ETV Bharat / city

'అసహనం పక్కనపెట్టి పనిపై దృష్టి పెడితే...పరిస్థితులు మెరుగుపడతాయి' - ఏపీ తాజా వార్తలు

TDP leaders on Naidupet incident: తిరుపతిలోనే సీఎం జగన్​ మాట్లాడుతుండగానే నాయుడుపేటలో అంబులెన్స్​ మాఫియా ఆగడాలు తాళలేక చిన్నారి మృతదేహాన్ని బైక్​పై తీసుకెళ్లారని నారా లోకేశ్​ అన్నారు. అసహనం పక్కన పెట్టి పనిపై దృష్టి పెడితే.. కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయని హితవు పలికారు.

Lokesh
నారా లోకేశ్
author img

By

Published : May 6, 2022, 10:51 AM IST

TDP leaders on Naidupet incident: కుళ్లు, కుతంత్రాలతో తెదేపా దుష్ప్రచారం చేస్తుందని మాట్లాడటం వల్ల జగన్​, వైకాపా నాయకులకు ఆత్మసంతృప్తి కలగొచ్చేమో కానీ... ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు. తెదేపాపై సీఎం జగన్​​ అక్కసుతో మాట్లాడుతున్న సందర్భంలోనే అంబులెన్స్ మాఫియా ఆగడాలు తట్టుకోలేక తిరుపతి జిల్లా నాయుడుపేటలో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్​పై సొంత ఊరికి తీసుకెళ్లాల్సి వచ్చిందని మండిపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది సహకరించక, అంబులెన్స్ మాఫియా డిమాండ్ చేసిన డబ్బు లేక చిన్నారి అక్షయ మృతదేహాన్ని 18 కిలోమీటర్లు బైక్​పై తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది.. వైకాపా ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. అసహనం పక్కన పెట్టి పనిపై దృష్టి పెడితే కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయని లోకేశ్​ హితవు పలికారు.

  • మీపై కుళ్ళు, కుతంత్రాలతో దుష్ప్రచారం చేస్తున్నారని మీరు మాట్లాడడం వల్ల మీకు, మీ నాయకులకు ఆత్మసంతృప్తి కలగొచ్చు ఏమో కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు జగన్ రెడ్డి గారు. మీరు మా పై అక్కసుతో మాట్లాడుతున్న సందర్భంలోనే అంబులెన్స్ మాఫియా ఆగడాలు తట్టుకోలేక..(1/3) pic.twitter.com/GbyUEVNWZb

    — Lokesh Nara (@naralokesh) May 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • కొత్తపల్లి కి తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది వైసిపి ప్రభుత్వం. ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి పని పై దృష్టి పెట్టండి. కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయి.(3/3)

ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం.. మృతదేహం తరలింపునకు 108 నిరాకరణ.. బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.