Attack on Anna canteen in Kuppam కుప్పంలో తక్షణమే సాధారణ పరిస్థితుల్ని పోలీసులు తీసుకురాకుంటే సీఎం నివాసం, డీజీపీ కార్యాలయాన్ని తెదేపా శ్రేణులు ముట్టడిస్తాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. సీఎం జగన్ దుర్మార్గుడని, ఫ్యాక్షనిస్ట్ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తుంటే పోలీసులు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. చంద్రబాబును దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న కాంటీన్ పెడుతుంటే దాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు. త్వరలో చంద్రబాబు కడపలో పర్యటిస్తారన్న అచ్చెన్నాయుడు... ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా అడ్డుకుంటారో చూస్తామని సవాల్ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే జగన్ పాదయాత్ర చేసేవాడా అని నిలదీశారు. జగన్‌కు పిచ్చి ముదిరి పరాకాష్టకు చేరి చంద్రబాబు పర్యటన అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లా అండ్ ఆర్డర్ లేకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు వేస్తే ఒక రేటు, దాడి చేస్తే ఒక రేటు ఇచ్చి వైకాపా కార్యకర్తలను ఉసికొల్పుతున్నారన్నారు. జడ్‌ప్లస్ భద్రతలో ఉండే చంద్రబాబునే ఇలా చేయడం ఏంటని అచ్చెన్నాయుడు విమర్శించారు.
నారా లోకేశ్: కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రారంభించబోయే అన్న క్యాంటీన్‌ను వైకాపా శ్రేణులు ధ్వంసం చేయడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి పేదవాళ్లకు అన్నం పెట్టడు, ఇతరులను పెట్టనివ్వడని మండిపడ్డారు. జగన్ రెడ్డి తన రౌడీయిజం పులివెందులలో చూపించుకోవాలని... కుప్పంలో కాదని హితవు పలికారు. కుప్పం జోలికి వస్తే వైకాపా అల్లరిమూకల తాటతీస్తామని హెచ్చరించారు. జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లపై వైకాపా మూకలు దాడులు చేస్తూనే ఉన్నాయని లోకేశ్ ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన వీడియోలను లోకేశ్ విడుదల చేశారు.
-
ఈ రోజు కుప్పంలో చంద్రబాబు గారు ప్రారంభించబోయే అన్న క్యాంటీన్ ను వైసిపి గూండాలు ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ రౌడీయిజం పులివెందులలో చూపించుకో.. కుప్పంలో కాదు జగన్ రెడ్డి. కుప్పం జోలికి వస్తే వైసిపి అల్లరిమూకల తాటతీస్తాం.(2/2)#AnnaCanteen
— Lokesh Nara (@naralokesh) August 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఈ రోజు కుప్పంలో చంద్రబాబు గారు ప్రారంభించబోయే అన్న క్యాంటీన్ ను వైసిపి గూండాలు ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ రౌడీయిజం పులివెందులలో చూపించుకో.. కుప్పంలో కాదు జగన్ రెడ్డి. కుప్పం జోలికి వస్తే వైసిపి అల్లరిమూకల తాటతీస్తాం.(2/2)#AnnaCanteen
— Lokesh Nara (@naralokesh) August 25, 2022ఈ రోజు కుప్పంలో చంద్రబాబు గారు ప్రారంభించబోయే అన్న క్యాంటీన్ ను వైసిపి గూండాలు ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ రౌడీయిజం పులివెందులలో చూపించుకో.. కుప్పంలో కాదు జగన్ రెడ్డి. కుప్పం జోలికి వస్తే వైసిపి అల్లరిమూకల తాటతీస్తాం.(2/2)#AnnaCanteen
— Lokesh Nara (@naralokesh) August 25, 2022
ఇవీ చదవండి: