ETV Bharat / city

Devineni arrest: దేవినేని అరెస్ట్‌పై తెదేపా నేతల ఆగ్రహం - తెదేపా నేత దేవినేని ఉమా వార్తలు

పోలీసుల ప్రోద్భలంతోనే మాజీ మంత్రి దేవినేని ఉమపై హత్యాయత్నం జరిగిందని తెదేపా నేతలు ఆరోపించారు. కుట్రను ఛేదిస్తూ న్యాయపరంగా పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. దాడికి పాల్పడిన వైకాపా నేతలను వదిలిపెట్టి, తెదేపా నేతలపై హత్యాయత్నం కేసు పెట్టడమేంటని చంద్రబాబు నిలదీశారు. నాటకీయ పరిణామాల మధ్య మాజీమంత్రి దేవినేని ఉమాను అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీతో పాటు దాదాపు 15కుపైగా సెక్షన్లు నమోదు చేశారు. ఉమాతో పాటు మరో 17మందిపై దాసరి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు.

TDP leaders condemn Devineni Uma's arrest
దేవినేని ఉమా అరెస్టును ఖండించిన తెదేపా నేతలు
author img

By

Published : Jul 28, 2021, 11:26 PM IST

దేవినేని ఉమా అరెస్టును ఖండించిన తెదేపా నేతలు

తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమా అరెస్టుపై.. తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దేవినేని ఉమాపై పోలీసులే దాడికి కుట్ర పన్నారని ఆరోపించారు. దాడి జరిగే ప్రదేశం వైపు ఉమాను దారి మళ్లించి ప్రత్యక్షంగా, పరోక్షంగా భౌతిక దాడిని సహకరించటంలో పోలీసులే కీలక పాత్ర పోషించారని పలువురు పార్టీ నేతలు ధ్వజమెత్తారు. వైకాపా అరాచ‌క‌పాల‌న‌, మైనింగ్ మాఫియా, అవినీతి - అక్ర‌మాలు - ఆగ‌డాలకు అడుగ‌డుగునా అడ్డుప‌డున్నార‌నే దేవినేనిని అరెస్టు చేశారని ఆక్షేపించారు.

కాపాడమంటే క్రిమినల్ కేసులు పెడతారా: తెదేపా ఎమ్మెల్యేలు

సహజ వనరులు కాపాడమంటే దేవినేని ఉమాపై హత్యాయత్నం, క్రిమినల్ కేసులు పెట్టడమేంటని తెదేపా ఎమ్మెల్యేలు.. ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్​లు ధ్వజమెత్తారు. వైకాపా నేతల అవినీతిని ఉమా ప్రశ్నిస్తే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. అవినీతికి అడ్డొచ్చే వారిని భౌతికంగా అంతమొందించేందుకూ వెనుకాడటం లేదని విమర్శించారు. దాడిచేసిన వారిని వదిలిపెట్టి.. దేవినేనిపై ఎదురు కేసులు పెట్టడం కక్షసాధింపు చర్యలకు నిదర్శనమేనని ఆరోపణలు చేశారు. అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేసినవారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్​లో మారణాయుధాలతో దాడిచేసినట్లు పేర్కొనడం దుర్మార్గమని ఆక్షేపించారు.

వారి లక్ష్యం నెరవేరింది: నక్కా ఆనంద్ బాబు

మాజీ మంత్రి దేవినేని ఉమాను ఎలాగైనా జైలుకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం కల నెరవేరిందని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు దుయ్యబట్టారు. “కొండపల్లి అటవీ ప్రాంతం నుంచి వస్తున్న దేవినేని ఉమాను.. దారి మళ్లించి హత్యాయత్నం జరిగేలా కుట్ర పన్నింది పోలీసులేనని మండిపడ్డారు.

బెయిల్ కు అనుకూలంగా లేని సెక్షన్లు దేవినేని ఉమాపై పెట్టడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. వైకాపా నేతలు చెప్పిందల్లా చేస్తున్న పోలీసులు.. పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఉమాతో పాటు 18మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని మండిపడ్డారు. దేవినేని ఉమా ఫిర్యాదు తీసుకోకుండా ఆయనపైనే తప్పుడు కేసు పెట్టడం దుర్మార్గమని అన్నారు.

వారిని పెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులకు తెగపడుతున్నారు: అమర్నాథ్ రెడ్డి

పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులకు తెగపడుతోందని.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. దేవినేని ఉమా అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. మాజీ మంత్రికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైకాపా నాయకుల అవినీతిని చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.

హత్యారాజకీయాలకు చిరునామా వసంత కృష్ణ ప్రసాద్: పంచుమర్తి అనురాధ

హత్యారాజకీయాలకు చిరునామా వసంత కృష్ణ ప్రసాద్​ అని.. తెదేపా నేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు. కృష్ణప్రసాద్ కుటుంబం గతంలో జర్నలిస్టులను హత్యలు చేయించిందని ఆరోపణలు చేశారు. ప్రశాంతంగా ఉండే మైలవరంలో తరచూ అల్లర్లు సృష్టిస్తున్నారని విమర్శించారు. నిందితుల్ని వదిలి బాధితులపై కేసు పెట్టాలని ఏ చట్టం చెప్తోందని నిలదీశారు.

శిక్షించటం మాకూ వచ్చు: అశోక్ బాబు

అక్రమ కేసులు పెడుతున్న పోలీసులను.. చట్టపరంగా శిక్షించటం తమకూ వచ్చని ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు. అక్రమ మైనింగ్​కు ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వైకాపా గూండాల దాడికి పోలీసులు సహకరించారని విమర్శలు చేశరు. ఉమా పై దాడి చేయించటంతో.. అక్రమమైనింగ్​ కు సూత్రధారి తానేనని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఒప్పుకున్నట్లేనని అన్నారు. ఈ ముఖ్యమంత్రిని గద్దెదింపేందుకు ప్రతీ కార్యకర్తా జైలుకెళ్లేందుకు సిద్ధమేనన్నారు. వైకాపాకు సహకరిస్తున్న పోలీసులకు ప్రభుత్వం మారిన వెంటనే శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Tdp leaders serious on Govt: 'వైకాపా దోపిడీని అడ్డుకుంటే.. దాడులు చేస్తారా?'

మాజీమంత్రిపై దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు: ఆలపాటి రాజా

ఓ మాజీమంత్రిపై.. రౌడీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని మాజీమంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. దేవినేని ఉమా అరెస్టు.. ప్రభుత్వ నిరంకుశ విధానాలకు పరాకాష్ట అని అన్నారు. ఉమాను చంపేందుకు యత్నిస్తే.. పోలీసులు రక్షించకుండా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు చేశారు. తన పనులకు అడ్డొస్తున్నవారిని చంపటమే పనిగా ముఖ్యమంత్రి పెట్టుకున్నారని ఆరోపణలు చేశారు. దేవినేనిపై అక్రమ కేసులు ఉపసంహరించుకోకుంటే.. ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఉమా పై దాడి చేయడం దారుణం: కొనకళ్ల నారాయణరావు

దేవినేనిపై దాడి చేయటం దారుణమని.. కొనకళ్ల నారాయణరావు ధ్వజమెత్తారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై దాడి చేయడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. మీ అవినీతి అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడి అక్రమ అరెస్టులు చేస్తారా అని ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు.

దేవినేని ఉమా ఎం నేరం చేశారని, ఏ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశారని అక్రమ అరెస్టు చేశారని నిలదీశారు. మాజీ మంత్రికే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే.. సామాన్యులకు రక్షణ ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే.. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని కొనకళ్ల విమర్శించారు.

పోలీసులే దేవినేని ఉమాపై దాడికి కుట్ర పన్నారు: ధూళిపాళ్ల నరేంద్ర

దేవినేని ఉమాపై దాడికి.. పోలీసులే కుట్ర పన్నారని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. దాడి జరిగే ప్రదేశం వైపు.. ఉమాను దారి మళ్లించి ప్రత్యక్షంగా, పరోక్షంగా భౌతిక దాడిని సహకరించటంలో పోలీసులే కీలక పాత్ర పోషించారని ధ్వజమెత్తారు. పక్కా ప్రణాళికతోనే పోలీసులు దాడి జరిగే మార్గం వైపు ఉమాని దారి మళ్లించారని ఆరోపణలు చేశారు.

"దాడి జరుగుతోందని ఉమాకు ముందస్తు సమాచారం ఇచ్చిన పోలీసులు ఎందుకు బలగాలను మోహరించలేదు. తనపై దాడి జరిగిందని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానంటే పోలీస్ స్టేషన్ కు కూడా ఉమాని రానివ్వకపోగా తిరిగి ఆయనపైనే అక్రమ కేసులు పెట్టారు. ఉమా చుట్టూ పోలీసులు ఉండగా అతనిపై దాడికి యత్నించారనే కేసులు ఎలా పెడతారు. కారులో నుంచి కిందకి దిగని వ్యక్తి వేరే వ్యక్తిపై ఎలా దాడి చేశారు. ఉమా కారు నుంచి దిగకపోవటంతోనే పోలీసులు అద్దాలు పగలగొట్టి, అరెస్టు చేసింది నిజం కాదా. మాజీ మంత్రి ఫిర్యాదుచేయలేని స్థితిలో ఉండటం రాష్ట్రంలో శాంతిభద్రతలకు అద్దం పడుతోంది. దాడిలో పోలీసుల ప్రమేయం, వారిపాత్రపై రాష్ట్రసంస్థలతోకాకుండా, బయటిసంస్థలతో విచారణ జరిపించాలి. ఈ కుట్రల్ని అవకాశం ఉన్న అన్ని వేదికాల ద్వారా ఎండగడతాం" -ధూళిపాళ్ల నరేంద్ర

మాజీమంత్రికే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితేంటి: చినరాజప్ప

రాష్ట్రంలో ఓ మాజీమంత్రికే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితేంటని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒక్కరిపై 100మంది వైకాపా గూండాలు దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడికి పాల్పడిన వైకాపా కార్యకర్తల్ని అడ్డుకోకుండా ఉండేందుకే పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి రాలేదని ఆరోపణలు చేశారు. ప్రజా సంపదను దోచుకుంటున్న వైకాపా నేతలను.. తెదేపా నేతలు అడ్డుకోవటం తప్పా.. అని నిలదీశారు.

ఇదీ చదవండి: Tdp Leaders House Arrest: తెదేపా నేతల గృహ నిర్భంధం

సంబంధిత కథనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.