తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాల అక్రమ స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని.. కస్టమ్స్ అధికారులకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామప్రసాద్ నేతృత్వంలో బండా వంశీ కృష్ణ, వడ్డేంపూడి రామకృష్ణ.. కమిషనర్ వెంకటరామిరెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. ఘటన వెనుక దాగి ఉన్న కుట్రలను చేధించాలని కస్టమ్స్ అధికారులను కోరారు.
మయన్మార్ వద్ద సరిహద్దు దాటుతున్న 125 సంచుల తలనీలాలు తితిదేవి అని అస్సాం రైఫిల్స్ నిర్థారిస్తే.. తమకు సంబంధం లేదని తితిదే అధికారులు ఎలా చెప్తారని రామప్రసాద్ ప్రశ్నించారు. ఇంతవరకు విచారణ జరపకుండా దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అస్సాం రైఫిల్స్ వివరాలు తప్పు అయితే.. తితిదే అధికారులు వారిపై ఎందుకు పరువు నష్టం దావా వేయలేదని నిలదీశారు.
ఇదీ చదవండి: