తెదేపా అమలుచేసిన పసుపు - కుంకుమ పథకం కింద సుమారు కోటి మంది మహిళలు లబ్ధిపొందారని, ప్రస్తుత సీఎం జగన్ మాత్రం ఆ సంఖ్యను 23 లక్షలకే కుదించారని తెదేపా నేత వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి సొమ్ము, తిరిగి మద్యం దుకాణాల ద్వారా పాలకులకే చేరుతోందని అన్నారు.
చేయూత కింద ఇచ్చిన సొమ్ముని వాడుకోవద్దని, దాన్ని అలానే ఉంచి, మరో ఖాతాకు బదిలీ చేస్తే మూడు రెట్లు కలిపి తరువాత చెల్లిస్తామని వాలంటీర్లు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు. డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: