ETV Bharat / city

జడ్జి రామకృష్ణను జైల్లోనే హత్య చేసేందుకు కుట్ర : వర్ల రామయ్య - judge-ramakrishna-

జడ్జి రామకృష్ణను జైల్లోనే హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ రాసిన లేఖపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

tdp-leader-varla-ramayya
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
author img

By

Published : May 31, 2021, 9:39 PM IST

చిత్తూరు జిల్లా కారాగారంలో 45రోజులుగా రిమాండ్​లో ఉన్న జడ్జి రామకృష్ణను జైల్లోనే హత్య చేసేందుకు కుట్ర పన్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంత్రి పెద్దిరెడ్డితో పాటు విశ్రాంత న్యాయమూర్తులు నాగార్జున రెడ్డి, ఈశ్వరయ్యలు ప్రధాన కుట్రదారులని ఆరోపించారు. సహచర ఖైదీ బ్యారెక్ వద్ద కత్తి దొరికిందని జడ్జి రామకృష్ణ అతని కుమారుడు వంశీకృష్ణకు సమాచారం అందించారని వర్ల రామయ్య తెలిపారు. తన తండ్రికి ప్రాణహాని ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పోలీసు ఉన్నతాధికారులకు వంశీకృష్ణ లేఖ రాశారన్నారు. పోలీసులు వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

రాష్టంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.