వైకాపా నేతలు గత రెండున్నరేళ్లుగా పోలీసుల్ని కించపరుస్తున్నా స్పందించని పోలీసు అధికారుల సంఘం.. అయ్యన్న వ్యాఖ్యలపైనే స్పందించడమేంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిలదీశారు. సవాంగ్ నేతృత్వంలో పోలీసు శాఖ గొప్పగా పని చేస్తోందనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
"అధికార పార్టీ నేతలు తమను ఏమన్నా పర్లేదు, ప్రతిపక్షనేతలు మాత్రం అనటానికి వీల్లేదన్నట్లుగా పోలీసు అధికారుల సంఘం తీరుంది. వైకాపా నేతలు కాసు మహేశ్ రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కర్రి పాపారాయుడు, ప్రసన్నకుమార్ రెడ్డి తదితరులు పోలీసు అధికారులపై చేసిన విమర్శలు పోలీసు అధికారుల సంఘానికి వినిపించలేదా?. చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమం తలపెడితే ఆయన ఇంటికి తాళ్లు కట్టమని పోలీసులకు ఏ రాజ్యాంగం చెప్పింది. విశాఖ, తిరుపతి విమానాశ్రయాల్లో చంద్రబాబును పోలీసులు అడ్డుకోలేదా?. అమరావతి పర్యటనలో చంద్రబాబు వాహనశ్రేణిపై దాడి జరిగితే ప్రజాస్వేచ్ఛ అని డీజీపీ చెప్పలేదా?. అధికారపార్టీకి తాము తొత్తులమని పోలీసుల్లో అనేకమంది బహిరంగంగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబును చంపేందుకు వచ్చిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారు?." - వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
ఇదీ చదవండి:
TDP: 'చంద్రబాబు జోలికొస్తే ఊరుకోం..సహనం నశిస్తే రోడ్లపై తిరగలేరు'