Varla Ramaiah letter to DGP: తెదేపా కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు.. సంఘ విద్రోహ శక్తులు నుంచి ముప్పు ఉందని వర్ల లేఖలో పేర్కొన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులు సైతం తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి తీవ్రమైన ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేశారని, పార్టీ కార్యాలయానికి 24 గంటల పాటు సాయుధ బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.
![TDP leader Varla ramaiah letter to DGP Rajendranath reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14678570_tdp.jpg)
ఇదీ చదవండి:
Ayyannapatrudu fires on Roja: అనితతో చర్చకు సిద్ధమా?.. రోజాకు అయ్యన్నపాత్రుడు సవాల్