ETV Bharat / city

'వైకాపా ప్రభుత్వం నేరస్థులకు స్నేహ హస్తం అందిస్తోంది' - వర్ల రామయ్య తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్ తాను చేసిన తప్పులు దిద్దుకోవటంలో బిజీగా ఉండటంతో.. పరిపాలన అస్తవ్యస్తమైందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. వైకాపా ప్రభుత్వం నేరస్థులతో స్నేహం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు.

varla ramaiah
వర్ల రామయ్య, తెదేపా నేత
author img

By

Published : Oct 16, 2020, 4:08 PM IST

వైకాపా ప్రభుత్వం నేరస్థులకు స్నేహహస్తం అందిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. పోలీస్ స్టేషన్​లో ఎస్ఐ పుట్టినరోజు వేడుకకు స్థానిక ముద్దాయిలు వచ్చి శుభాంకాంక్షలు తెలపటం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ఇసుక మాఫియా డాన్ తరఫున పోలీసులు ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయలేదా? అని నిలదీశారు. తన పాత్ర సజ్జల నిర్వహిస్తున్నారనే బాధలో హోంమంత్రి ఉన్నారని విమర్శించారు. చేసిన తప్పులు సరిదిద్దుకోవటంలో సీఎం బిజీగా ఉండటంతో.. పరిపాలన అస్తవ్యస్తమై శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి..

వైకాపా పాలనలో పోలీసులంటే నేరగాళ్లకు భయం లేదు: వర్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.