Vangalapudi Anitha: ఒకప్పుడు హారతికే పరిమితమయ్యే జగన్ భార్య భారతి.. నేడు భర్తను వెనకేసుకురావడం, తెచ్చిన సూట్కేసులు లెక్కేసుకోవడం, చేస్తున్న తప్పులను ప్రచార ఆర్భాటాలకు ఉపయోగించడం చేస్తున్నారని.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి చేసే తప్పుల్లో భారతికి భాగముందని ఆరోపించారు. కొవిడ్ బాధితులకు కేంద్రం ఇచ్చిన రూ.11 కోట్లు నిధులను దారి మళ్లించడం దోపిడీ విధానమేనని ఆక్షేపించారు.
కరోనా సోకిన వారికి రూ.2వేలు అకౌంటులో జమ చేశామంటున్నా, లెక్కలు చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందా అని సవాల్ విసిరారు. సామాజిక న్యాయం అంటూ జగన్ భజన బృందం ప్రజల చెవుల్లో పూలు పెడుతోందని విమర్శించారు. నిత్యావసర సరుకుల సరఫరా పేరుతో ప్రజల సొమ్ముతో 9,800 వాహనాలు కొని రూ.650 కోట్లు ప్రజాధనాన్ని దోచారని దుయ్యబట్టారు. మహిళల అభయహస్తం నిధులు రూ.200 కోట్లు దారి మళ్లించి స్వాహా చేశారని అనిత ఆరోపించారు.
ఇవీ చూడండి: