ETV Bharat / city

'జగన్​ పాలనలో 500 మంది మహిళలపై దాడులు, హత్యలు జరిగాయి' - విజయవాడ తాజా వార్తలు

జగన్​ పాలనలో... 500 మంది మహిళలపై దాడులు, హత్యలు జరిగాయని తెదేపా నాయకురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. వైకాపా హయాంలో మహిళలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ.. విజయవాడలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో కాన్సెప్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు.

TDP leader Vangalapudi Anita is angry over the attacks on women
'జగన్​ పాలనలో 500 మంది మహిళలపై దాడులు, హత్యలు జరిగాయి'
author img

By

Published : Mar 10, 2021, 12:08 AM IST

జగన్ పాలనలో మహిళలు ఇబ్బంది పడకపోతే మహిళా దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకునేవాళ్లమని తెదేపా నాయకురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 22 నెలల వైకాపా పాలనలో 500 మంది మహిళలపై హత్యలు, దాడులు, దౌర్జన్యాలు జరిగాయని ఆమె మండిపడ్డారు. జగన్ పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ.. విజయవాడలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో కాన్సెప్ట్ గ్యాలరీని ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు.

అనూషకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. కానీ ఆమె తండ్రి రూ. 20 లక్షలు ప్రభుత్వానికే ఇస్తానని, అనూషకు అన్యాయం చేసిన వాడికి శిక్షపడేలా చూడాలని అన్నప్పుడు బాధగా అనిపించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంత మంది మహిళలను చంపుతున్నా, దారుణాలకు గురవుతున్నా డీజీపీ దగ్గర నుంచి సీఎం వరకు అందరూ.. దిశ చట్టం గురించి మాట్లాడుతుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ టీడీ జనార్థన్, గుంటూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.