ETV Bharat / city

SOMIREDDY ON ROADS: మరమ్మతులు చేస్తానంటే.. వైకాపాకు ఇబ్బందేంటి..?: సోమిరెడ్డి

రాష్ట్రంలో రహదారులు భవనాల శాఖ మూతపడిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(somireddy on roads) ధ్వజమెత్తారు. ఇప్పటికే వ్యవసాయ, పంచాయితీరాజ్ శాఖలను కూడా మూసేశారని విమర్శించారు. దెబ్బతిన్న రహదారులకు జనసేన మరమ్మతులు చేస్తానంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు.

somireddy chandramohan reddy on state roads
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
author img

By

Published : Oct 1, 2021, 7:56 PM IST

Updated : Oct 1, 2021, 9:52 PM IST

రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు(somireddy on roads) జనసేన మరమ్మతులు చేస్తానంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(tdp leader Somireddy Chandramohan Reddy) నిలదీశారు. 'అమ్మపెట్టదు.. అడుక్కోనివ్వదు' అన్నట్లు వైకాపా ప్రభుత్వం తీరు ఉందని విజయవాడలో నిర్వహించిన సమావేశంలో దుయ్యబట్టారు.

"రాష్ట్రంలో రహదారులు భవనాల శాఖ మూతపడింది. వ్యవసాయ, పంచాయితీరాజ్ శాఖలనూ ఇప్పటికే మూసేశారు. నాబార్డు ద్వారా రూ.1100కోట్ల నిధులు పొందినా.. రాష్ట్ర వాటా 30శాతం చెల్లించాల్సి వస్తుందని మొత్తం పనుల్ని ప్రీక్లోజర్ చేశారు. ఓసారి పనులు ప్రారంభించి ప్రీక్లోజర్ చేస్తే 5ఏళ్ల పాటు మళ్లీ ఆ పనులు చేయటానికి వీల్లేదనే కొత్త నిబంధనలు ఆర్థిక శాఖ తీసుకురావటం ఘోరం. తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.3690కోట్లతో 6694కిలోమీటర్ల మేర రహదారులు నిర్మిస్తే.. మంత్రి పెద్దిరెడ్డి కేవలం 330కిలోమీటర్లేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో మొదలైన రూ.4500కోట్ల పనులను వైకాపా ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఎన్​డీబీ కింద రూ.6400కోట్ల రుణానికి అనుమతులు తెస్తే, 30శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించలేక వాటిని పొగొట్టింది" అని సోమిరెడ్డి(Chandramohan Reddy comments on ycp) మండిపడ్డారు.

15శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారు..

బిల్లుల చెల్లింపుల్లో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని కాదని.. బడ్జెట్ కార్యదర్శి సత్యనారాయణ పెత్తనం చేలాయిస్తున్నారని సోమిరెడ్డి(tdp leader Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. "15శాతం కమీషన్ ఇచ్చిన వారికే బిల్లులు చెల్లించే దుస్థితికి జగన్​ ప్రభుత్వం వచ్చింది. వైకాపా ప్రభుత్వ నొక్కుడు భరించలేక గుత్తేదారులు ఎవరూ.. పనులు చేసేందుకు ముందుకు రావట్లేదు. సీఎఫ్ఎంఎస్ విధానాన్ని పక్కనపెట్టి పిక్ అండ్ పే పద్ధతిని అమలు చేస్తున్నారు. ఏ దస్త్రానికి ఆమోదం తెలపాలన్నా సత్యనారాయణ 90రోజులు సమయం తీసుకుంటున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానానికి స్వస్తి పలికారు. బిల్లుల చెల్లింపుల్లో జోక్యం వద్దని ఆర్థిక శాఖ మంత్రికి సీఎంవో ఆదేశాలివ్వడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. పోయేకాలం వచ్చినందుకే దారుణాలకు ఒడిగడుతున్నారు. రహదారుల దుస్థితి వల్ల రాష్ట్రంలో ప్రమాదాలు పెరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయి" అని సోమిరెడ్డి అన్నారు.

ఇదీ చదవండి..

Group-1 mains results: మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి.. ఫలితాలివ్వండి: హైకోర్టు

Last Updated : Oct 1, 2021, 9:52 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.