SOMI REDDY ON OTS : ప్రభుత్వం చేపట్టినా ఓటీఎస్ కార్యక్రమంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ కార్యక్రమమని విమర్శించారు. ఓటీఎస్ పేరుతో పేదప్రజల గొంతుపై కత్తి పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వసూళ్ల కోసం అన్ని శాఖల ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను వంచించి.. దివాలా తీసిన ఖజానాను నింపుకొవటమే ఓటీఎస్ అని విమర్శించారు.
వివిధ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలు పంపిణీ చేసిన ధనాన్ని.. ఓటీఎస్ పేరుతో దొడ్డిదారిన వసూలు చేస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను.. కాంట్రాక్టు ఉద్యోగి అయిన వార్డు కార్యదర్శికి బదిలీ చేశారని ధ్వజమెత్తారు. వారితో రిజిస్ట్రేషన్ చేయించి.. వారిని బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు. ఇంటి స్థలాల కోసం ఇచ్చిన అసైన్మెంట్ భూములను పది సంవత్సరాల దాకా అమ్మకూడదు అనే చిన్న సవరణ చేసి, అసైన్డ్ భూములను ట్రాన్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్-1884 పరిధిలోకి తీసుకురావడం దారుణమన్నారు.
ఎలాంటి న్యాయపరమైన సలహా లేకుండా చేసిన ఈ పని.. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కుల్ని తెస్తుందని హెచ్చరించారు. ఓటీఎస్ కింద చేస్తున్న రిజిస్ట్రేషన్ల చట్టబద్ధతపై సోమిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ల పేరుతో జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చే రంగు కాగితాలకు విలువు ఉంటుందా? అని నిలదీశారు.
ఇదీ చదవండి