TDP leader pattabhi fires on YSRCP: తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పోర్ట్ కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ ఎగుమతులపై సీబీఐ విచారణ జరిపించాలని.. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. బియ్యం బకాసురుల గుట్టు రట్టు కావాలంటే ఇంతకంటే మరో మార్గం లేదన్నారు.
గోడౌన్ల నుంచి పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని బియ్యం అక్రమంగా తీసుకొస్తే.. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కాకినాడలో ఉంటూ విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి అల్లుడి అధీనంలోని కాకినాడ పోర్టును అక్రమాలకు అడ్డాగా మార్చేశారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టుల పెండింగ్: సోము వీర్రాజు