ETV Bharat / city

రాష్ట్రంలో పోర్టులన్నీ సీఎం జగన్ గుప్పెట్లో పెట్టుకున్నారు: పట్టాభి - పోర్టుల గురించి సీఎం జగన్​పై తెదేపా నేత పట్టాభి ఫైర్

రాష్ట్రంలోని పోర్టుల ద్వారా దోచిన సంపదను.. విదేశాలకు తరలించాలనే కుట్ర సీఎం జగన్​ రెడ్డిది అని.. తెదేపా నేత పట్టాభి విర్శించారు. రాష్ట్రంలో పోర్టులన్నీ సీఎం జగన్ తన గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ఒకదాని తర్వాత మరొకటిగా పోర్టులన్నీ ఒకే సంస్థకు ఎలా దక్కుతాయో సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

tdp leader pattabhi fires on cm jagan on ports issues
రాష్ట్రంలో పోర్టులన్నీ సీఎం జగన్ గుప్పెట్లో పెట్టుకున్నారు: పట్టాభి
author img

By

Published : Mar 12, 2021, 4:46 PM IST

రాష్ట్రంలో పోర్టులన్నీ సీఎం జగన్ తన గుప్పెట్లో పెట్టుకున్నారని.. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. పోర్టుల ద్వారా దోచిన సంపదను.. విదేశాలకు తరలించాలనే కుట్ర సీఎం జగన్​ రెడ్డిదని విమర్శించారు. విజయసాయిరెడ్డి దగ్గరి బంధువుల సంస్థ అయన అరబిందో ద్వారా.. పోర్టుల కబ్జాకు తెరలేపారని ధ్వజమెత్తారు. కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ తోపాటు, రామాయపట్నం పోర్టుని కూడా అరబిందో కే ముఖ్యమంత్రి దోచిపెట్టారని విమర్శించారు. ఒకదాని తర్వాత మరొకటిగా పోర్టులన్నీ ఒకే సంస్థకు ఎలా దక్కుతాయో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాకినాడ గేట్, కాకినాడ సీపోర్ట్ షేర్లను, అరబిందోకు ఎలా బదలాయించారో వెల్లడించాలని నిలదీశారు. ఇదంతా తన దోపిడీ కోసం ముఖ్యమంత్రి నడిపిన వ్యవహారమని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: రామవరంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.