"జగన్ రెడ్డి హవాలాతో రాష్ట్రం దివాలా తీసే దుస్థితి తలెత్తింది" అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం పెంచకుండా సొంత ఆదాయం పెంచుకుంటున్నారని ఆరోపించారు. రెండేళ్లలో జగన్ రెడ్డి, ఆయన అనుచరుల కంపెనీలు కళకళలాడుతుంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం రోజురోజుకూ దిగజారిపోతోందని మండిపడ్డారు.
"రాంకీ షేర్ విలువ ఏడాది కాలంలో 442 శాతం పెరిగింది. జగన్ రెడ్డి సొంత కంపెనీ భారతీ సిమెంట్స్ ప్రధాన వాటాదారు అయిన వైకాట్ అనే ఫ్రెంచ్ కంపెనీ తొలి త్రైమాసికంలోనే 42శాతం వృద్ధి సాధించింది. దీని విలువ రూ.800కోట్లు. సిమెంట్ బస్తాను రూ.450 వరకూ పెంచినందుకే వైకాట్ అంత వృద్ధి నమోదు చేసింది. విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన అరబిందోకు రాష్ట్రంలోని 3 ప్రధాన పోర్టులు, అంబులెన్సులు దోచిపెట్టారు. హెటిరోకు విలువైన భూములు బోనస్‌గా ఇచ్చారు. గత రెండేళ్లలో జగన్ రెడ్డి, అతని అనుచరుల సంస్థల్లో లాభపడనది ఏదీ లేదు" - పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిధి
బ్యాంకులు షరతులు విధించే పరిస్థితి ఏర్పడింది..
రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ పడిపోవటంతో ప్రభుత్వం తీసుకున్న రుణాల రికవరీపై నమ్మకం లేక బ్యాంకులు షరతులు విధిస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ఏడో తేదీ వరకూ ఉద్యోగులకు జీతాలు, ఫించన్లు ఇవ్వలేని పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ కల్పించారని.. సొంత ఖజానాను మాత్రం నింపుకొంటున్నారని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో గ్యారెంటీతో అప్పులిచ్చే బ్యాంకులు ఇప్పుడు తనఖా పెట్టాలనే షరతులు విధిస్తున్నాయని చెప్పారు. తాజా షరతుల ప్రకారం 2021-22 కాలానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.27,668 కోట్లు మాత్రమే అప్పు తీసుకునే పరిస్థితికి దిగజారిందని విమర్శించారు.
ఇదీ చదవండి: