ఏ ఆధారం లేకుండా తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్న మంత్రి బొత్స, విజయసాయిరెడ్డి లాంటి వారికి డీజీపీ లేఖలు ఎందుకు రాయలేదని పట్టాభి ప్రశ్నించారు. వైకాపా నేతలు ఏం మాట్లాడినా ప్రేక్షకపాత్ర పోషించటం పక్షపాత ధోరణి కాక మరేంటని ధ్వజమెత్తారు. మత విధ్వేషాలు రెచ్చకొట్టిన మంత్రి కొడాలి నానిపై ఏం చర్యలు తీసుకున్నారని పట్టాభి అడిగారు. వైకాపా నేతలకు ఒక న్యాయం ఇతరులందరికీ మరో న్యాయమా? అనేది డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీకి అనుకూల వైఖరి తీసుకున్న విధంగా పోలీస్ శాఖకు అధిపతిగా ఉన్న డీజీపీ పక్షపాతంగా వ్యవహరించటం దురదృష్టంమని పట్టాభి విమర్శించారు. ప్రజల పక్షాన నిజాలు మాట్లాడినందుకు రేపు నాపైనా తప్పుడు కేసులు పెట్టొచ్చని పట్టాభి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దాడి: చంద్రబాబుకు డీజీపీ లేఖ