పోలీసులు స్వామి భక్తిని చాటుకునేందుకు మితిమీరి ప్రవర్తిస్తున్నారని, వారి పద్ధతి ఎంతమాత్రమూ సరికాదని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపొద్దన్నట్లుగా ఖాకీల తీరు ఉందని చినరాజప్ప((nimmakayala chinarajappa)) ఆరోపించారు. డ్రగ్స్ (drug in ap) వ్యవహారంపై మాట్లాడిన ధూళిపాళ్ల నరేంద్రకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
"ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపకూడదన్నట్లుగా ప్రతిపక్షాల పట్ల పోలీసుల తీరుంది. మాదకద్రవ్యాల దందా గురించి మాట్లాడిన ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఎలా ఇస్తారు? సీఆర్పీసీ చట్టం 160 ప్రకారం సాక్షిని విచారించాలన్నా.. పోలీసులు ఇతర ప్రాంతానికి వెళ్లి నోటీసులు ఇవ్వకూడదు. 91 సెక్షన్ ప్రకారం ధూళిపాళ్ల నరేంద్ర దగ్గర సాక్ష్యాలుంటే తీసుకోవాలి కానీ.. విచారణకు రావాలని నోటీసులిచ్చే అధికారం పోలీసులకు లేదు. శాంతిభద్రతల పర్యవేక్షణలో విఫలమైన పోలీసులు, ప్రతిపక్షనేతలను అణచివేసేందుకే దృష్టి పెడుతున్నారు. వాస్తవాలు మాట్లాడే వారిని భయభ్రాంతులకు గురిచేసేలా పోలీసుల తీరుంది. మాదకద్రవ్యాల దందాపై ఎన్ఐఏ ఇంకా ఎలాంటి విచారణ చేపట్టకుండానే.. బ్లూ మీడియాలో రాష్ట్రానికి సంబంధం లేదనే వార్తలు వేయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మాదకద్రవ్యాల దందా జరుగుతోందన్నది వాస్తవం." -నిమ్మకాయల చినరాజప్ప
ఇదీ చదవండి:
APERC: విద్యుత్ సర్దుబాటు ఛార్జీల వసూలుపై ఏపీఈఆర్‌సీ పునఃసమీక్ష