మూడు రాజధానులపై ప్రజల రిఫరెండం కోరుతూ..ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న చంద్రబాబు సవాల్‌కు మంత్రి పెద్దిరెడ్డి కట్టుబడతారా ? అని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. పెద్దిరెడ్డికి, ముఖ్యమంత్రికి నిజంగా దమ్ము, ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆయన సవాల్ విసిరారు. వైకాపా ఎంపీలు ఎంతమంది ఉన్నా..రాష్ట్రానికి సాధించిందేం లేదని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు.
వైకాపా ఎంపీలతో రాష్ట్రానికి ఉపయోగమేంటని తిరుపతి పార్లమెంట్ ఓటర్లు చర్చించుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కుని గాలికొదిలేసిన వారికి ఓటేస్తే రాష్ట్రానికి అన్యాయం చేసినట్లేనన్నారు.
ఇదీచదవండి