ETV Bharat / city

రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి.. చినజీయర్ స్వామి వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి : నారా లోకేశ్ - తెదేపా జాతీయ ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేశ్

రాష్ట్రంలోని ర‌హ‌దారుల దుస్థితిపై.. చిన‌జీయ‌ర్ స్వామి ఆవేద‌న‌తో స్పందించారని.. తెదేపా జాతీయ ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి రాజ‌మ‌హేంద్రవ‌రం వరకూ సాగిన తమ ప్రయాణంపై.. చినజీయర్ స్వామి వ్యంగ్య బాణాలు సంధించారు.

tdp leader lokesh releases video of Chinna Jeeyar swamy commented on ap roads
రాష్ట్రంలో రోడ్డు ప్రయాణాలు జ్ఞాపకంగా మిగిలిపోనున్నాయి: నారా లోకేశ్
author img

By

Published : May 19, 2022, 12:19 PM IST

ఏపీ రోడ్లపై స్పందించిన చినజీయర్ స్వామి

రాష్ట్రంలో ర‌హ‌దారులపై చిన‌ జీయ‌ర్ స్వామి ఆవేద‌న‌తో స్పందించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. గ‌తుకులు-గుంత‌లు, ఒడిదుడుకుల గురించి జీయర్ స్వామి ప్రస్తావించిన వీడియోను లోకేశ్ విడుదల చేశారు. చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలతో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో ర‌హ‌దారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతోందని లోకేష్ ట్విటర్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు న‌డిచేందుకు కూడా వీలుగా లేవ‌ని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. ప‌క్కరాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా మ‌న రాష్ట్రాన్ని చూపిస్తున్నారని, అయినా ప్రభుత్వ స్పంద‌న శూన్యమని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

  • రాష్ట్రంలో రోడ్లు న‌డిచేందుకు కూడా వీలుగా లేవ‌ని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారు. ప‌క్క‌రాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా మ‌న ఏపీని చూపిస్తున్నారు. అయినా ప్ర‌భుత్వ స్పంద‌న శూన్యం. రాజ‌కీయాల‌కు దూరంగా, ఆధ్మాత్మిక ప్ర‌పంచానికి ద‌గ్గ‌ర‌..,(1/3) pic.twitter.com/mFyPNidS1i

    — Lokesh Nara (@naralokesh) May 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చినజీయర్ ఏమన్నారంటే..? : భక్తులను ఉద్దేశించి ప్రసంగం చేస్తున్న సమయంలో.. ప్రయాణం గురించి వివరించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై చినజీయర్‌ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉండొచ్చని, ఒక్కోసారి గొతులు ఎక్కువగా ఉండొచ్చని అన్నారు. తాము జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం వరకు ప్రయాణించామని, ఆ అనుభవం చాలా బాగుందని వ్యంగ్య బాణాలు సంధించారు. చక్కగా జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు.

"ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉండవచ్చు. ఒక్కోసారి గోతులు ఎక్కువ ఉండవచ్చు. మేం జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం దాకా రావడానికి.. చాలా బాగుంది.. చక్కగా జ్ఞాపకం ఉండేట్టు ఉంది" అని చినజీయర్ స్వామి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.