ETV Bharat / city

ఆ విషయాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోంది: లోకేశ్ - ప్రభుత్వంపై లోకేశ్ కామెంట్స్

కల్తీసారాపై వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోందని తెదేపా నేత లోకేశ్ అన్నారు. అందుకే నాటుసారాపై శాసనసభలో చర్చకు రాకుండా పారిపోతున్నారని విమర్శించారు.

ఆ విషయాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోంది

author img

By

Published : Mar 22, 2022, 4:07 PM IST

ఆ విషయాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోంది

నాటుసారాపై వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. మద్యంలో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్ రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని.. నిజాలు బయటపడతాయని చర్చ నుంచి పారిపోతున్నారని విమర్శించారు.

తమకు ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు లేదా ? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో ప్రజా సమస్యలు చర్చించమంటే సభాపతి మార్షల్స్​ను రమ్మంటున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రులు బొత్స, కొడాలి నాని తరహాలో మా సభ్యులు ఎవ్వరూ ప్రవర్తించట్లేదన్నా లోకేశ్.. గతంలో కౌన్సిల్ ఛైర్మన్​గా ఉన్న షరీఫ్​ను బొత్స కులం పేరుతో దూషిస్తే.. కొడాలి నాని ఛైర్మన్ టేబుల్ ఎక్కారంటూ ఆరోపించారు.

ఈ కొత్త సంప్రదాయాన్ని మునుపెన్నడూ చూడలేదు..

శాసనమండలిలో ఇవాళ్టి పరిణామాలకు చింతిస్తున్నామని.. ముఖ్యమంత్రి, ప్రభుత్వం సభకు క్షమాపణ చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీలు ఫరూక్, బీటెక్ రవి, రామచంద్రరావు డిమాండ్ చేసారు. శాసన మండలిలో కోరం లేకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఛైర్మన్.. మంత్రులు, సభ్యుల కోసం వేచి చూసే కొత్త సంప్రదాయాన్ని తామెన్నడు చూడలేదని మండిపడ్డారు. ఓ ప్రజాసమస్యపై చర్చ కోసం ఏనాడూ ప్రతిపక్షం ఇన్ని రోజులు వేచి చూడలేదని తెలిపారు. కమీషన్ కోసమే జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇదీ చదవండి : Jangareddygudem Issue: 'కల్తీసారా కాటే'.. తేల్చిచెప్పిన బాధిత కుటుంబ సభ్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.