ETV Bharat / city

వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: కొల్లు రవీంద్ర - TDP leader Kollu Ravindra latest news

కుప్పం మున్సిపల్ ఎన్నికలలో వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాచేపల్లి, గురజాల స్థానిక ఎన్నికల్లో పోలీసు రక్షణ కల్పించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు తగినంత రక్షణ కల్పించటంతో పాటు పోలింగ్ బూత్ ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

తెదేపా నేత కొల్లు రవీంద్ర
తెదేపా నేత కొల్లు రవీంద్ర
author img

By

Published : Nov 11, 2021, 9:02 PM IST

కుప్పం మున్సిపల్ ఎన్నికలలో వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం.. గుర్తుకు వస్తుందని, అటువంటి కుప్పంలో అప్రజాస్వామిక విధానాలలో తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలని వైకాపా కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార యంత్రాంగాన్ని చేతుల్లోకి తీసుకుని కుప్పం ప్రజాతీర్పును వమ్ము చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుప్పం సమగ్రాభివృద్దికి కారణమైన తెలుగుదేశం పట్ల, చంద్రబాబు పట్ల ప్రజలకు గౌరవముందని, వారంతా తెదేపాకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు.

డీజీపీకి వర్ల రామయ్య లేేఖ..

హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన దాచేపల్లి, గురజాల స్థానిక ఎన్నికల్లో పోలీసు రక్షణ కల్పించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు తగినంత రక్షణ కల్పించటంతో పాటు పోలింగ్ బూత్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికార వైకాపా స్థానిక ఎన్నికల్లో తన అంగబలం, అర్థబలంతో అక్రమాలకు పాల్పడుతూ శాంతిభద్రతలు దెబ్బతీస్తోందన్నారు. ఓవర్గం పోలీసుల అధికారపార్టీ నేతలతో కుమ్మక్కై ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఆరోపించారు. కుప్పంలో తెదేపా అభ్యర్థులపై దాడులు, అక్రమంగా నామినేషన్లు తిరస్కరించటం, అర్థరాత్రి అక్రమ అరెస్టులు వంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. పోలీసు రికార్డుల్లో ఇవేమీ నమోదు చేయకుండా ఆధారాలు లేకుండా చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపురం లోని 14, 15 వ వార్డుల్లో తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు ప్రచారం నిర్వహించారు.

దాచేపల్లి పోలీస్​స్టేషన్ వెళ్లిన తెదేపా నేతలు..

గుంటూరు జిల్లా దాచేపల్లిలో డబ్బులు పంచుతున్నారని ముగ్గురు తెదేపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావు దాచేపల్లి పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.

ఇదీ చదవండి:

పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి.. సీఎం భయపడుతున్నారు: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.