దగ్ధమైన అంతర్వేది రథంపై సీబీఐ విచారణ జరిపించి దోషులను శిక్షిస్తానన్న సీఎం జగన్.. ఆ పని చేయకుండా నూతన రథాన్ని ఎలా ప్రారంభిస్తారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. దశాబ్దాల నుంచి ఎంతో పవిత్రంగా ఉన్న రథాన్ని తగలబెట్టినవారిని శిక్షించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కొత్త రథాన్ని ప్రారంభించారని ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 దేవాలయాలపై దాడులు జరిగినా.. సీఎం, డీజీపీ, హోంమంత్రి మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. హిందూమతంపై జరిగిన దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్తరథం ప్రారంభోత్సవాన్ని రాజకీయాలకు వాడుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా తితిదేను తన రాజకీయాలకు వాడుకున్న జగన్, నేడు ముఖ్యమంత్రి హోదాలో హిందూ మతాన్ని వాడుకుంటున్నారని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:
విశాఖ ఉక్కు విషయం చాలా సున్నితమైనది: సోము వీర్రాజు