ETV Bharat / city

రాయితీపై తుంపరసేద్యం పరికరాలు ఎందుకివ్వట్లేదు: కాలవ శ్రీనివాసులు

90 శాతం రాయితీపై రైతులకు తుంపరసేద్యం పరికరాలు ఎందుకు ఇవ్వట్లేదని వైకాపా ప్రభుత్వాన్ని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు నిలదీశారు. తెలుగుదేశం అందించిన సంక్షేమంలోనూ కోత పెట్టి తమది రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.

kalva Srinivasulu comments on ycp
కాలవ శ్రీనివాసులు
author img

By

Published : Jul 16, 2021, 10:00 PM IST

తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు 90శాతం రాయితీపై ఇచ్చిన తుంపరసేద్యం పరికరాలను వైకాపా ప్రభుత్వం ఎందుకివ్వట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు నిలదీశారు. గత రెండేళ్ల కాలంవో కేంద్రం నుంచి రూ.3వేల కోట్ల సాయాన్ని నిరాకరించిన ఏకైక ప్రభుత్వం వైకాపా అని దుయ్యబట్టారు.

"రాయలసీమ రైతుల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకే కంటితుడుపు చర్యగా రూ.1190కోట్లతో డ్రిప్ రాయితీ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల వాటాగా 10శాతం మాత్రమే డబ్బులు వసూలు చేయాల్సిన ఈ పథకంలో దాదారు 25శాతం వరకు రైతుల ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. తెదేపా అందించిన సంక్షేమంలోనూ కోత పెట్టి రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి రైతుల గురించి మానేసి కులాలు, రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడతారు. రెండేళ్లలో జగన్ రెడ్డి వ్యవసాయన్ని సంక్షోభంలోకి నెట్టి.. రైతుల్ని నడిరోడ్డుపై నిలబెట్టారు. ప్రభుత్వ సాయానికి నోచుకోవట్లేదనే బాధ, ఆవేదనతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాతలకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది. ఈ క్రాప్ నమోదు సక్రమంగా జరగకపోవడంతో పంటల బీమా పరిహారానికి రైతులు నోచుకోలేకపోయారు" అని కాలువ మండిపడ్డారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి బోర్డులు ఆధీనంలోకి తీసుకొస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్​ను పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. నీటి వివాదం తలెత్తకుండా తెలుగు రాష్ట్రాలు.. సఖ్యతతో ఉండాలన్నదే తమ విధానమని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.

ఇదీ చదవండి..

water dispute: 'సీఎంలు కూర్చొని మాట్లాడితే జల వివాదం పరిష్కారమవుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.