విద్యుత్ ఉత్పత్తి చేతకాక ఏసీలు, ఫ్యాన్లు ఆపమంటున్న ప్రభుత్వం..మరికొన్ని రోజుల్లో వ్యవసాయం సంక్షోభం తలెత్తిందని ఒక్కపూటే భోజనం చేయమంటుందేమోనని తెదేపా నేత కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తన అవినీతి, చేతకానితనంతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి రాష్ట్రాన్ని అంధకారం చేశారని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి చేతకాక ఏసీలు ఆపి, ఫ్యాన్లు బంద్ చేయమని ప్రజలకు చెప్పటం సిగ్గుచేటన్నారు.
ఇచ్చిన మాటకు తాను కట్టుబడనని రుజువు చేస్తూ జగన్ రెండున్నరేళ్ల పాలనలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ. 36,802 కోట్ల భారం మోపారని కళా ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే విద్యుత్ రంగాన్ని జగన్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. విద్యుత్ సంస్థలకు తగినంత సబ్సిడీ ఇవ్వకుండా, తక్కువ ధరకు లభించే విద్యుత్ కాదని, అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి
భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చు: ప్రభుత్వ సలహాదారు సజ్జల